Home /News /telangana /

GANDHARI KILLA JATARA IN ADILABAD ARRANGEMENTS ARE READY ADB VRY

Adilabad : గాంధారి ఖిల్లా జాతర .. ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు...

ghandari jatara

ghandari jatara

Adilabad : మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ నాయక, పోడుల ఆరాధ్య దైవమైన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించాలని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

    ( Lenin ,News 18 Telugu , Adilabad, )

    మంచిర్యాల జిల్లాలోని ఆదివాసీ నాయక, పోడుల ఆరాధ్య దైవమైన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించాలని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.

    ఈ సంధర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ కు కమిటీ సభ్యులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కమిటీ ఆద్వర్యంలో ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కమిటీ వైస్ చైర్మన్ గంజి రాజన్న, పెద్దయ్య పూజారి అర్జున్, కర్ణపేట సర్పంచ్ మార్నేని రాజేశ్వరి, తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ తదితరులు పాల్గొన్నారు.

    Guest lecturer Suicide : ఇద్దరు గెస్ట్ లెక్చరర్ల మధ్య అక్రమ సంబంధం.. లేడీ లెక్చరర్ బెదిరింపులు

    Nalgonda : ట్రాన్స్‌జెండర్స్‌తో ఫ్రెండ్‌షిప్.. నమ్మిన వారే నరకం చూపించారు.. తల, మొండెం వేరు చేసి

    ఈ సందర్భంగా గాంధారీ ఖిల్లా మైసమ్మ జాతర కమిటి కోశాదికారి తాట్ర భీంరావ్ మాట్లాడుతూ.. ప్రతియేటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఆదివాసి నాయకపోడుల ఆరాధ్యదైవమైన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతుందన్నారు. ఈ జాతరకు తెలంగాణలోని ఆదివాసీలు నాయకపోడులు, గిరిజనేతరులు అత్యధికంగా పాల్గొని మైసమ్మ తల్లిని దర్శించుకుంటారన్నారు. ఈ జాతరకు సుమారుగా లక్షకు పైగా భక్తులు పాల్గొంటారని, కావున భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ ను కలిసి వినతి పత్రం అందించడం జరిగిందని, స్పందించిన ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ త్వరలోనే మంచిర్యాల జిల్లాలోని గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి దర్శించుకుంటారని, ఆపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జాతర ఎర్పాట్లను కూడా చేయనున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు, ఆదివాసేతరులు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జరిగే గాంధారి మైసమ్మ తల్లి జాతరను పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.

    Hyderabad : దారుణం.. సహజీవనం వద్దని వెళ్లిన మహిళ సజీవదహానం.. ?

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Telangana

    తదుపరి వార్తలు