హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar : రైస్‌మిల్లులో గంజాయి సాగు..కూలీల పనా..?యాజమాన్యమా..?

Karimnagar : రైస్‌మిల్లులో గంజాయి సాగు..కూలీల పనా..?యాజమాన్యమా..?

Karimnagar : రైలు మిల్లుమాటున గంజాయి మొక్కలు పెంచారు... పక్కా సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మొక్కలను ధ్వంసం చేయడంతోపాటు సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Karimnagar : రైలు మిల్లుమాటున గంజాయి మొక్కలు పెంచారు... పక్కా సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మొక్కలను ధ్వంసం చేయడంతోపాటు సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Karimnagar : రైలు మిల్లుమాటున గంజాయి మొక్కలు పెంచారు... పక్కా సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మొక్కలను ధ్వంసం చేయడంతోపాటు సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేశారు.

  ( పెద్దపల్లి జిల్లా.తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

  ఓ వైపు తెలంగాణలో డ్రగ్స్, గంజాయి పై ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు అక్రమార్కులు తమ దందాను మాత్రం ఆపడం లేదు.. పీడీ యాక్టులు, అనేక రకాల కేసులు పెడుతున్నా రాష్ట్రంలో గంజాయి రవాణకు అనేక మార్గాలు ఎంచుకోవడంతో పాటు గంజాయి ఉత్పత్తికి కూడా అనేక మార్గాలు వెతుకుతున్నారు. ప్రధానంగా గంజాయి ఉత్పత్తి సాధారణంగా గ్రామీణ ,మారుమూల ప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తారు. దీంతో అధికారులు వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కాని ఉత్పత్తిదారులు మాత్రం ఏకంగా మైదాన ప్రాంతంలోనే గంజాయి చెట్లను పెంచుతున్నారు. ఇళ్లు, పెరటి ఇలా ఎక్కడ ఖాలీ స్థలాలు ఉన్నా గంజాయికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.

  ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సాంబశివ అనే రైస్‌మిల్లులోనే గంజాయి మొక్కలను పెంచారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. మిల్లులోనే ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను చూసి పోలీసులు అశ్చర్యానికి గురయినట్టు తెలిపారు. కాగా ఇంత పెద్దగా గంజాయి మొక్కలను ఎవరు పెంచారు మిల్లు యజమాన్యమే దీనికి కారణమా... ? లేక ఇతర కార్మికులు ఎవరైనా పెంచుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా అక్కడ బీహారీ కూలీలు పనులు చేస్తుండడంతో వారే తమ అవసరాల కోసమే పెంచుతున్నారా అనేది దర్యాప్తు చేస్తున్నారు.

  ఈ క్రమంలోనే రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సరఫరా విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.. గంజాయి సరఫరా దారులపై ప్రత్యేక దృష్టి సారించామని , ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం - అందించాలన్నారు . గంజాయి రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత అని , పూర్తిస్థాయి నిర్మూలనకు పోలీసు శాఖకు సహకరించాలని పోలీసులు తెలిపారు.ఇప్పటికే సీఎం కెసిఆర్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతుంటే కొంత మంది అవేమి తమకు పట్టనట్లు గంజాయి తోటలానే పెంచడం  శోచనీయం అని పలువురు అంటున్నారు.

  యువత విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ మత్తు పానీయాలకు అలవాటు పడకుండా తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ మరియు కంపెనీల్లో పని చేస్తున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థపై నిఘా ఉంచి అకస్మాత్తుగా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం వారిపై పీడీ యాక్టు పెట్టి తగిన శిక్షలు ఇవ్వడం జరుగుతుందని రామగుండం సీపీ తెలిపారు.. ఎవరైనా ఎలాంటి చర్యలకు పాల్పడినట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు తెలిపితే వారి వివరాలను గొప్యంగా ఉంచుతామణి తెలిపారు.


  కాగా రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగుదారులతో పాటు విక్రయదారులపై ఇప్పటికే పీడి యాక్టులు కూడా పెడుతున్నారు. ఇలా వందల కొద్ది కేసులు ఇప్పటికే పీడీ యాక్టులు నమోదుచేస్తున్నారు.

  First published:

  Tags: Karimnagar, Telangana

  ఉత్తమ కథలు