తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు అద్భుతమైన గిఫ్ట్‌ను సిద్ధం చేశారు. ఈ నెల 17 న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్, అభిమానులు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. భావితరాలకు పచ్చని చెట్లతో ఆరోగ్యాన్ని పంచాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి తోడవుతూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ వేదికగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిస్తూ మొక్క చేతిన పట్టి సమూహంగా ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు
(17.02.2020) కానుకగా 66వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2600మంది కార్యకర్తలు, అభిమానులు కలిసి హరిత స్పూర్తిని చాటనున్నారు. అందరూ సమూహంగా నిల్చొని తమ అభిమాన నేత ఆకారం (కేసీఆర్ ముఖచిత్రం పోలి)లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కార్యక్రమం చేపడుతున్నారు.
బాలమల్లు , ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా, నియోజకవర్గ ముఖ్య నేతలు, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్ రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం హైలెట్ గా నిలవనుంది. ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణ హిత రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్ని నిజం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.