కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563) 4 లేన్ పనులకు మోక్షం లభించింది. రహదారి కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563) 4 లేన్ పనులకు మోక్షం లభించింది. రహదారి విస్తరణ పనుల కోసం రూ.2,146 కోట్ల 86 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా ఈ ప్రాజెక్టును
భారతమాల పరియోజన పథకం కింద చేపట్టారు.. ఇప్పటికే పరిపాలన పరమైన అనుమతులు లభించడంతో తాజాగా నిధులు కూడా మంజూరు కావడంతో శరవేగంగా విస్తరణ పనులు ప్రారంభమం
కానున్నాయి. ఈ రహదారి విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్ -వరంగల్ మీదుగా ప్రయాణించే ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగడమే కాకుండా ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని
అవకాశాలు మెరుగవుతాయి.
4-Laning of Karimnagar Warangal Section of NH-563 in the State of Telangana has been sanctioned with a budget outlay of ₹ 2146.86 Cr. under #Bharatmala Pariyojana. #PragatiKaHighway #GatiShakti @TelanganaCMO @kishanreddybjp @bandisanjay_bjp @BJP4Telangana
— Nitin Gadkari (@nitin_gadkari) March 8, 2022
ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఇందుకోసం ఆయన గత కొంత కాలంగా కేంద్ర మంత్రి నితిన్
గడ్కరీతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కలిసి నిధులపై చర్చించారు.నిధులు మంజూరు చేయడంపట్ల బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Karimnagar, Telangana