CM KCR : హరిత నిధికి అప్పుడే నిధులు..... విరాళాలు ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధులు..

CM KCR : హరిత నిధికి అప్పుడే నిధులు..... విరాళాలు ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధులు..

CM KCR : హరిత నిధిని సీఎం కేసిఆర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. అయితే ఆ నిధులను ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల నుండి వసూలు చేయనున్నట్టు ప్రకటించారు. సీఎం ప్రకటించిన వెంటనే.. ప్రజా ప్రతినిధులు నిధులు సైతం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

  • Share this:
    ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) మానస పుత్రికగా చెప్పుకునే హరిత హారం ( harita haram ) శాశ్వతంగా కొనసాగించేందుకు ఆయన శాశ్వత పరిష్కారం చూపించారు. భవిష్యత్ ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్న హరితహారాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగించేందుకు సీఎం నిర్ణయించారు. ఇందుకోసం హరిత నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో నిధులను కేటాయించడతో పాటు ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు నిర్ణయించారు.

    దీంతో ప్రజా ప్రతినిధులు ( public Representatives ) ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీల నుండి ప్రతినెల వారికి ఇచ్చే గౌరవ వేతనంలో నుండి 500 రూపాయలు, రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జీతాల నుండి 100 రూపాయలను ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి 25 రూపాయలను వారి జీతాల నుండి వారి అనుమతితో నిధులను సమీకరించే ప్రణాళికను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారం చేసే బార్లు, వైన్స్‌లతోపాటు ఫర్టిలైజర్స్ ఇతర వ్యాపారాలు రెన్యువల్ సమయంలో ప్రతి సంవత్సరం 1000 రూపాయలను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న రిజిస్ట్రేషన్లలో కూడా హరిత పన్నును వసూలు చేయాలని బావిస్తున్నట్టు సమాచారం.

    ఇది చదవండి : న్యూయార్క్ లాంటీ నగరాలే మునిగిపోతున్నాయి.. అయినా.. రజనీకాంత్ మృతికి మాదే బాధ్యత 


    సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా నాలుగు శాతం మేర అడవుల (forest) విస్తరణ జరిగినట్టు పలు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు మారినా ఇందుకోసం శాశ్వత నిధి ఏర్పాటు చేయడం ద్వారా మరింత శాతం అడవులను పెంచుకునేందకు అవకాశాలు ఏర్పడనున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయంతో దాతలు కూడా ముందుకు వచ్చి హరిత నిధికి సహకరించే అవకాశాలు ఉంటాయి. కాగా ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆ పార్టీ నేత ఎంపీ రంజిత్ రెడ్డి (mp Ranjit reddy ) హరిత ఫండ్ కోసం 5000 రూపాయలు కూడా అప్పుడే ప్రకటించారు. దీంతో హరిత హరాన్ని ఒక సామాజిక ఉద్యమంగా కొనసాగించాలనే లక్ష్యం ప్రజల సహకారంతో సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతుందా లేదా అనేది భవిష్యత్ తేల్చనుంది.

     ఇది చదవండి : ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు... ఉత్సాహాంతో పని చేయండి..

    Published by:yveerash yveerash
    First published: