హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cyber crime : ఇదిగో అర్డర్.. అంటూ పండ్ల వ్యాపారీకి టోకరా.. శృతిమించిన సైబర్ వల..

Cyber crime : ఇదిగో అర్డర్.. అంటూ పండ్ల వ్యాపారీకి టోకరా.. శృతిమించిన సైబర్ వల..

cyber crime

cyber crime

Cyber crime : సైబర్ నేరగాళ్ల ఆగడాలు.. శృతిమించాయి.. మోసం చేయడం.. డబ్బులు సంపాదించడమే ద్యేయంగా కార్యకలపాలు కొనసాగిస్తున్నారు.. ( Cyber crime) చివరికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని కూడా వదలిపెట్టడడం లేదు.

  సైబర్ నేరగాళ్ల దృష్టి పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ( Rural area ) ప్రాంతాలకు మళ్లింది. పట్టణాల్లో సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలోనే వారి దృష్టి మరల్చినట్టు కనిపిస్తోంది. గిఫ్టులు, స్నేహం,లవ్ పేరుతో ఇన్నాళ్లు బురిడి కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు తాజాగా సరికొత్త ప్లాన్‌కు తెరతీశారు. అదికూడా గ్రామీణ ప్రాంత జిల్లాల్లో వారి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ( Cyber crime)ఈ క్రమంలో వ్యక్తిగత టార్గెట్స్ నుండి వ్యాపారం పేరుతో మెసెజ్‌లు పంపి, వాటికి స్పందిస్తున్న వారి ఖాతాల నుండి డబ్బులు దోచే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని మారుమూల జిల్లా అయిన మహాబుబ్‌నగర్ లో పండ్ల వ్యాపారీ తోపాటు బండిపై వ్యాపారిని కూడా మోసం చేసిన సంఘటన మహబూబ్‌నగర్ ( Mahabubnagar ) ఉమ్మడి జిల్లా పరిధిలో గల మక్తల్‌లో తాజాగా వెలుగు చూసింది.

  వివరాల్లోకి వెళితే.. " నా పేరు నర్సింగ్ నేను ఆర్మీ జవాన్ అని చెప్పడంతోపాటు మక్తల్ పట్టణంలోని ఆర్మీ క్యాంపు‌లో జవాన్ గా ఉన్నాను మాకు ఎక్కువ మొత్తంలో పండ్లు కావాలి" అని వాట్సాప్ ద్వారా మెసెజ్ పెట్టారు.. ఆ తర్వాత ఓ నంబర్ ఇచ్చారు. ఇలా పలువురి వ్యాపారులకు మెసెజ్ పెట్టారు. ఎక్కువ మొత్తంలో ఆర్డర్ అంటూ పండ్ల వ్యాపారులను నమ్మించే ప్రయత్నం చేశారు. ( Cyber crime)అయితే పెద్ద సంఖ్యలో ఆర్డర్ ఉండడతో హనీఫ్ అనే ఓ పండ్ల వ్యాపారి ఆ వాట్సప్ మెస్సెజ్ స్పందించారు. అందులో ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేసి సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. దీంతో తాను ఆర్మీ అధికారిగా ప్రరిచయం చేసుకున్న సైబర్ నేరాగాడు.. తమకు అధిక మొత్తంలో పండ్లు కావాలని నమ్మించాడు. వేల రూపాయల పండ్లు అవసరం అవుతాయని చెప్పాడు.( Cyber crime) కాగా ప్రస్తుతానికి 8000 రూపాయల పండ్లు కావాలని చెప్పాడు. అయితే ఇందుకోసం ఓ కండిషన్ పెట్టాడు. తమ ప్రధాన కార్యాలయం ఢిల్లిలో ఉందని, డబ్బులు రావడం కొంత ఆలస్యం అవుతుందని చెప్పడంతో పాటు పెద్ద మొత్తంలో వ్యాపారం కావడంతో సంస్థకు ముందుగా కొంత డిపాజిట్ చేయాలని అన్నాడు.


  Khammam : కొత్త లిక్కర్‌ పాలసీ షురూ.. గ్రామాల్లో మొదలైన సిండికెట్‌ దందా..


  ఈక్రమంలోనే ముందుగా ఆర్డర్ పెట్టిన 8100 రూపాయలను తమ ఖాతాకు పంపాలని చెప్పాడు. దీంతో నమ్మిన ఆ వ్యాపారి నిజంగా వారు చెప్పిన ఖాతాకు చెప్పిన మొత్తాన్ని పంపాడు. డబ్బులు జమ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ చేశాడు. ( Cyber crime)తమకు డబ్బులు రాలేదని ఒప్పందం ప్రకారం మరో 32000 రూపాయలు పంపాలని చెప్పాడు. అయితే నిజమే అనుకుని తిరిగి వాటిని కూడా పంపారు. అవికూడా రాలేదని చెప్పడంతో నమ్మిన వ్యాపారి చివరి సారిగా మరో 1500 రూపాయలను పంపాడు. ( Cyber crime)ఇలా మొత్తం సుమారు 45 వేల రూపాయలు వరకు వారు చెప్పిన ఖాతాకు పంపినా డబ్బులు రాలేదని చెప్పడంతో ఆ వ్యాపారికి అనుమానం వచ్చింది. దీంతో అప్పుడు తేరుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.


  Maoist : మావోయిస్టు వారోత్సవాలు.. ఏజెన్సీలో హైఅలర్ట్‌.. స్వయంగా డీజీపీ పర్యటన


  మరోవైపు మక్తల్‌లోని మరో వ్యాపారికి కూడా ఇలాగే వాట్సప్ కాల్ చేసి పెరుగు, మరియు బిస్కట్స్ కోసం 8000 రూపాయల ఆర్డర్ అంటూ ఓ వేయి రూపాయాలు ముందుగా పంపాలని చెప్పారు. ( Cyber crime)దీంతో వేయి రూపాయలు పంపిన వ్యాపారిని సైతం ఇలాగే డబ్బులు రాలేదని బురిడి కొట్టించారు. కాని ఆ వ్యాపారీ వెంటనే తేరుకుని పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే స్పందించిన మక్తల్ పోలీసులు సైబర్ నేరగాళ్లు పంపిణ ఖాతకు స్ధంబింప చేశారు. ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:yveerash yveerash
  First published:

  Tags: CYBER CRIME, Mahabubnagar

  ఉత్తమ కథలు