
ప్రతీకాత్మక చిత్రం
తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకుని ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతిని ఇస్తారు.
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. లాక్డౌన్ తర్వాత రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి రైలు ఎక్కాలంటే.. రైల్వే స్టేషన్కు రెండు గంటల ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకుని ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతిని ఇస్తారు. టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ టికెట్ తీసుకోవాలి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్లో మంగళవారం జీఆర్పీ, ఆర్ఫీఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు.
Published by:Narsimha Badhini
First published:April 29, 2020, 18:32 IST