Home /News /telangana /

FREE TRAVELLING FOR WOMAN IN BUSES AND METRO RAIL AND MORE PROMISES IN GHMC BJP MANIFESTO AK

GHMC Elections: బస్సులు, మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం.. బీజేపీ మేనిఫెస్టోలో మరిన్ని హామీలు

జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్

జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్

GHMC Elections: తాము జీహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే బస్సుల్లో, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఆ దిశగా ప్రజలను ఆకట్టుకునేందుకు తమ మేనిఫెస్టోను రూపొందించింది. తాము జీహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే బస్సుల్లో, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. తాము గెలిస్తే ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని అన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నర్ స్కూలు పిల్లలకు ట్యాబ్ ఇవ్వడంతో పాటు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష మంది పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. 125 గజాల లోపు ఇళ్లకు ఉచితంగా అనుమతి ఇస్తామని తెలిపింది.

    గ్రేటర్‌లో తాము గెలిస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని.. కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తామని.. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.

    జీహెచ్ఎంసీ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్


    గ్రేటర్‌లో తాము విజయం సాధిస్తే నమామీ గంగే లాగే మూసీని అభివృద్ధి చేస్తామని బీజేపీ ప్రకటించింది. 10 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చింది. పేదలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడించింది. గృహ అవసరాలకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని పేర్కొంది. హైదరాబాద్ నగరం కేసీఆర్‌దో, ఓవైసీదో కాదని ఫడ్నవీస్ అన్నారు. ఇది అందరి నగరమని వ్యాఖ్యానించారు. ఎంఐఎం వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, GHMC Elections, Telangana

    తదుపరి వార్తలు