హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో అద్భుత వరం..

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో అద్భుత వరం..

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు.

TSRTC : ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్య అందించే వరం ప్రకటించారు.

  ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ, పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలు ఈనెల 2వ తేదీన ఇవ్వనున్నట్లు, అంతేకాదు.. సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ఒక్క ఉద్యోగిని కూడా ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని వారికి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కూడా కేటాయిస్తామని వెల్లడించారు. మొత్తం 26 రకాల వరాలు ప్రకటించిన సీఎం.. తాజాగా, కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్య అందించే వరం ప్రకటించారు. ఈ మేరకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య కోసం ఫీజులు చెల్లిస్తామని అన్నారు. మహిళా కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

  ఇదిలా ఉండగా, తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు.

  ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్‌ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185‌గా ఉండనుంది.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: CM KCR, Telangana, Telangana High Court, TSRTC Strike

  ఉత్తమ కథలు