హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam : కరోనా మృతులకు ఉచిత దహన సంస్కారాలు.. నయా పైస వద్దన్న మంత్రి

Khammam : కరోనా మృతులకు ఉచిత దహన సంస్కారాలు.. నయా పైస వద్దన్న మంత్రి

కరోనా మృతులకు ఉచిత దహన సంస్కారాలు.. నయా పైస వద్దన్న మంత్రి

కరోనా మృతులకు ఉచిత దహన సంస్కారాలు.. నయా పైస వద్దన్న మంత్రి

Khammam : కోవిడ్ మృతుల దహన సంస్కరణల కోసం అవసరమయ్యే కర్రలు ఇతర సామగ్రి అన్నిటిని మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఉచితంగా అందజేయాలని, మృతుల తరుపు వారి నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయవద్దని అని మంత్రి పువ్వాడ అజయ్ స్థానిక అధికారులను ఆదేశించారు.

ఇంకా చదవండి ...

కరోనా మృతుల దహన సంస్కరాలపై దేశ వ్యాప్తంగా ఆందోళన చెలరేగుతున్న విషయం తెలిసిందే..కరోనా సోకిన వ్యక్తి చనిపోతే..కనీసం ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతోంది..అంబులెన్స్ నుండి కాటి కాపారి వరకు అందరు డిమాండ్ చేసి కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు..అప్పటికే కరోనా వ్యాధిన పడడం ద్వార లక్షల రూపాయలను ఖర్చుతో ఇబ్బందిపడుతున్న కుటుంభాలకు మరణం తర్వాత జరిగిన పరిణామాలు మరింత కృంగదీస్తున్నాయి.. దీంతో చావు నుండి ఖననం వరకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది తమ కుటుంబ సభ్యుల శవాలను కూడ తీసుకుని వెళ్లలేక పోతున్నారు..

ఉత్తర భారతంలో అయితే కరోనా శవాలు ఖననం చేయకుండా నదీ ఒడ్డున పాతి పెట్టడడంతో వేల శవాలు నదీ తీరానికి కొట్టుకు వచ్చిన సంధర్భాలు అనేకం ఉన్నాయి...మరోవైపు తెలంగాణలో కూడ వందల కొద్ది కరోనా శవాలు ఉస్మానియాలో తీసుకువెళ్లలేని పరిస్థితి..దీంతో అటు ప్రధాని మోడీ ,ఇటు సీఎం కేసిఆర్‌లో కరోనా మృతులపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు..వారిని గౌరవంగా దహనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం స్మశాన వాటికలను సిద్దం చేసి వాటి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అటు అధికారులకు ఇటు ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని పలువరు మంత్రులు ప్రజా ప్రతినిధులు కరోన కట్టడితో పాటు కరోనా మృతులకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడుతున్నారు.

కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి ఉచిత దహన సంస్కారం నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వడ అజయ్ కుమార్ ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు.ఈ మేరకు ఖమ్మం కార్పొరేషన్ లోని బల్లెపల్లి వైకుంఠదామం ను మంత్రి పువ్వడ అజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి సందర్శించారు.

ఈ నేపథ్యంలోనే కోవిడ్ మృతుల దహన సంస్కరణల కోసం అవసరమయ్యే కర్రలు ఇతర సామగ్రి అన్నిటిని మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఉచితంగా అందజేయాలని, మృతుల తరుపు వారి నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయవద్దు అని మంత్రి పువ్వాడ అజయ్ స్థానిక అధికారులను ఆదేశించారు.


అనంతరం స్థానిక స్మశాన వాటికల ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ మృతదేహాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మృతుల తరుపున వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు.ఇప్పటి వరకు ఎన్ని దహన సంస్కరణలు జరిగాయి, ఎలా చేస్తున్నారు, చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో సుడా చైర్మన్ విజయ్ మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా కార్పొరేటర్లు కమర్తపు మురళి , కర్నాటి కృష్ణ నాగండ్ల కోటి , మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

First published:

Tags: Khammam, Puvvada Ajay

ఉత్తమ కథలు