సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ( ఎస్ ) మండలం నశీం పేట గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు.కాగా గాయపడ్డవారిలో ఒకరిని హుటహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు కూడా చికిత్స పొందుతూ ఉదయం చనిపోయినట్టు వైద్యులు దృవీకరించారు.
ప్రమాదంలో చనిపోయిన వారిని స్థానిక తండాలకు చెందిన అరవింద్, నవీన్ ,ఆనంద్ వినేశ్‌గా గుర్తించారు. ప్రమాదంలో వినేశ్ మినహా ముగ్గురు స్పాట్‌లో మృతి చెందగా వినేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కాని తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ నవీశ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారు.. కాగా రాత్రి జరిగిన ప్రమాదంలో వారు మద్యం సేవించి ఉన్నట్టు సమాచారం. వారి వద్ద మద్యం బాటిళ్లు లభంచడంతోపాటు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన ఇద్దరు 10 తరగతిలోపు విద్యార్థులు కాగా మరో ఇద్దరు స్థానికంగా క్యాటరింగ్ పనులు చేస్తున్నట్టు సమాచారం
మరో రెండు గంటల్లో పెళ్లి... అంతలోనే..
కాగా మరో మూడు గంటల్లో వివాహం చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు ఈ ఘటన గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నక్కల బండ తండా వద్ద చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న చైతన్య 36 సంవత్సరాలు గురువారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా చైతన్య బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు ఈ క్రమంలో కారు అదుపుతప్పి నక్కల బండ తండ వద్ద చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.