స్కూళ్లో ఆడుతూ.. పాడుతూ పాఠాలు నేర్చుకుంటున్న చిన్న పాపకు కాలు నుండి రక్తం కారుతుందని భయపడిన స్కూలు ఆయా..పసుపుపెట్టి గుడ్డతో కట్టుకట్టింది. అనంతరం ఆ పాపను స్కూళ్లోనే పడుకొట్టింది. కాని ఆ పాప శాశ్వత నిద్రపోయింది.(Baby death by snake bite ) కారణం ఆ పాపకు పాము కరిచిన విషయాన్ని ఆయా గమనించకపోవడం, తనకు ఏం జరిగిందో కూడా తెలియని చిన్నారీ పాప ప్రాణాలను పాము బలితీసుకొగా.. అందుకు ఆయా అమాయకత్వం కూడా తోడయ్యింది.
వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామానికి చెందిన కామల్ల రాజు-సంతోష దంపతుల కుమార్తె నిత్యశ్రీకి నాలుగు సంవత్సరాలు.. అయితే గత సంవత్సరకాలంగా నిత్యశ్రీ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. (Baby death by snake bite ) రోజులాగే గురువారం కూడా కేంద్రానికి వెళ్లిన నిత్య.. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంగన్‌వాడి సెంటర్ ముందు ఆడుకుంటుంది.. ఈ క్రమంలోనే నిత్యశ్రీ ఒక్కసారిగా కిందపడిపోయింది. (Baby death by snake bite ) దీంతో ఇది చూసిన అంగన్‌వాడి ఆయా.. దగ్గరికెళ్లి చూడడంతో.. నిత్యశ్రీ ఎడమకాలు పాదం వద్ద రక్తం కారటాన్ని గమనించింది..
ఇది చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..
వెంటనే ఆయా.. నిత్యశ్రీకి రక్తం కారుతున్న చోట పసుపురాసి,ఓ గుడ్డతో.. కట్టుకట్టి అంగన్‌వాడి కేంద్రంలోనే పడుకోబెట్టింది. అయితే గాయం విషయాన్ని కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియనీవ్వలేదు... ఇక కాసేపటి తర్వాత భోజనం పెట్టేందుకని నిత్యశ్రీని లేపే ప్రయత్నం చేసింది. (Baby death by snake bite ) అయితే ఎంత పిలిచినా పాప లేవకపోవడంతో మరో అంగన్ వాడి కార్యకర్త అనిత చిన్నారి తల్లికి సమాచారం అందించింది.
ఇది చదవండి : టీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టికాయత్.
దీంతో అంగన్ వాడి కేంద్రానికి చేరుకున్న పాప తల్లిదండ్రులు పాపను హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు పాముకాటుతో చిన్నారి మృతి చెందినట్టు చెప్పారు. అయితే.. అంగన్‌వాడీ కేంద్రం పక్కనే మురుగు కాల్వ, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ ఉన్నాయి. (Baby death by snake bite ) మూత్ర విసర్జన కోసం ప్రహరీ వద్దకు వెళ్లిన సమయంలో పాము కాటేసి ఉంటుందనే అనుమానంతో స్థానికులు అక్కడ పరిశీలించారు. దీంతో ఆ గోడ మధ్యలో రంధ్రాలను గుర్తించారు.. ఆ రంధ్రాలను తవ్వి చూశారు.. వారి అనుమానం నిజమైంది. రంధ్రాల్లో నుండి రెండు నాగుపాము పిల్లలను గుర్తించారు . (Baby death by snake bite ) అనంతరం వాటిని చంపివేశారు. కాగా పాము కాటును అంగన్‌వాడి కేంద్రం ఆయమ్మ గుర్తించి.. సకాలంలో చికిత్స అందించి ఉంటే.. బతికి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Siddipet, Snake bite