Home /News /telangana /

FOUR PEOPLE WERE DEATH IN CAR ACCIDENT IN KAMAREDDY VRY NZB

Kamareddy : కారు ప్రమాదం.. నలుగురు మృత్యువాత.. దీపావళీ వస్తువుల కోసం వెళ్లి..

Kamareddy : కారు ప్రమాదం.. నలుగురు మృత్యువాత.. దీపావళీ వస్తువుల కోసం వెళ్లి..

Kamareddy : కారు ప్రమాదం.. నలుగురు మృత్యువాత.. దీపావళీ వస్తువుల కోసం వెళ్లి..

Kamareddy : దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు సన్నద్దమవుతున్న ఓ కుటుంబం ఇంట్లో విషాదం నెలకొంది. ఉత్సహాంగా షాపింగ్‌కు వెళుతున్న కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. బాంబులు కొనేందుకు ఒకే కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    దీపావళీ పర్వదినాన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.. ఆనందంగా పండగ జరుపుకోవాలని భావించిన వారికి పండగకి ఒకరోజు ముందుగానే చీకట్లు కమ్ముకున్నాయి.. పండగకి బాంబులు తెచ్చుకునేందుకు వెళుతున్న వారు అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యారు.. ఈ విషాద ఘ‌ట‌న‌ కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.. దీపావళి టపాసుల కోసం వెళ్లిన వ్యక్తులు తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. వేగంగా వచ్చిన కారు అమాంతం చెట్టును ఢీ కొట్టడంతో ఓ చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

    కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన ఓ కుటుంబం దీపావళి టపాసులు కొనుగోలు చేసేందుకు చిన్నారులతో కలసి కారులో కామారెడ్డి వ‌చ్చారు.. టపాకాయాలు, పూజా సామాగ్రి, స్వీట్లు కొనుగోలు చేసి తిరిగి ప్రయాణం అయ్యారు.. తాడ్వాయి మండలం ఎర్రపాడ్ నుండి మోతె మెయిన్ రోడ్డులో కారు మర్రి చెట్టును ఢీ కొట్టింది.. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు అక్క‌డికి అక్క‌డే మృతి చెందారు.. మరో బాలుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. మృతులు జ‌గ‌న్(45), ఆనంద్ (28), శ్రీనివాస్ (52), శశాంక్ (5) గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది వరకు ప్రయాణిస్తున్నారు... కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. గాయప‌డిన వారిని కామారెడ్డి జిల్లా ప్ర‌భుత్వ‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది చదవండి : ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.. !

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Accident, Crime, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు