• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • FOUR PEOPLE BEHAVED BRUTALLY FOR MEAT TWO SURVIVING BUFFALO THIGHS WERE CUT WITH SHARP KNIVES AND ATTEMPTED TO BE COOKED AND EATEN IN SIDDIPETA DISTRICT TELANGANA VB MDK

Telangana Crime News: మాంసం కోసం.. బతికున్న పాడిగేదెల తొడలు కోసి.. అత్యంత క్రూరంగా..

ఘటనా స్థలంలో పాడి గేదె

Telangana Crime News: మాంసం కోసం నలుగురు వ్యక్తులు కిరాతకంగా ప్రవర్తించారు. బతికున్న రెండు గేదెల తొడలను పదునైన కత్తులతో కోసి వండుకొని తినే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గేదెల యజమాని వాటిని ఆస్థితిలో చూసి గుండెలవిసేలా విలపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఈ మధ్యకాలంలో మూగజీవుల పట్ల అరాచకంగా ప్రవర్తించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న మృగాళ్లను చూస్తూ ఉన్నాం. రాజస్థాన్ లో కుక్కను కారుకు కట్టి పైశాచిక ఆనందం పొందిన వారు, ఏనుగులను హింసించడం ఇలా చాలా చోట్ల చూస్తున్నాం. కానీ ఇక్కడ జరగిన సంఘటన తెలిస్తే మాత్రం రక్తం మరిగిపోతుంది. మాంసం కోసం బతికి ఉన్న రెండు గేదెల తొడలను అత్యంత క్రూరంగా కోశారు. అంతేకాకుండా వాటిని వండుకొని తినడానికి తన రూంకి తీసుకెళ్లారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల శివారులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సిరిసినగండ్ల-దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నేపాల్‌కు చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు పని చేస్తున్నారు. రాజగిరి వెంకటేశం అనే రైతు శుక్రవారం రాత్రి పొలంలోని పాకలో ఉన్న తన గేదెల నుంచి పాలు పిండుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి వేళ నలుగురు యువకులు కలిసి మాంసం కోసం పదునైన కత్తులతో రెండు గేదెల తొడ భాగాలను కోసేయడంతో అవి తీవ్ర రక్తస్రావమై మరణించాయి.

    శనివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు వాటిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అసలైమైందో కొంత సమయం వరకు అతడికి అర్థం కాలేదు. దగ్గరకు వెళ్లి చూడగా రెండు గేదెల తొడలు మొత్తం కోసినట్లు కనిపించింది. కంగారు కంగారుగానే అతడు గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. చుట్టుపక్కల వెతికాడు. ఈ పని ఎవరు చేసి ఉంటారా అని ఆరా తీశాడు. చివరకు గ్రామస్థులతో కలిసి చుట్టుపక్కల గాలించగా వ్యవసాయక్షేత్రంలో నిందితులు కనిపించారు. గేదె మాంసాన్ని వండుకునేందుకు సిద్ధం చేసుకుంటుండగా పట్టుకున్నారు. వాళ్లు దగ్గరకు వస్తున్నది చూసి ముగ్గురు నిందితులు అక్కడ నుంచి పారిపోగా నేపాలీ యువకుడు సందీప్‌ (25) మాత్రం పట్టుపడ్డాడు.

    అతడిని నిలదీయడంతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అనంతరం గ్రామస్థులు సిద్దిపేట పోలీసులకు సమాచారమిచ్చారు. సిద్దిపేట 3 టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందీప్ సునన్ అనే వ్యక్తి గత సంవత్సరం కాలంగా రాజేందర్ రెడ్డి దగ్గర కూలి పని చేస్తున్నట్లుగా తెలిసింది.
    Published by:Veera Babu
    First published: