ప్రస్తుతం రోజులు మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే నిండు జీవితాన్ని అర్ధాంతరంగా బలి చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, మార్కులు రాలేదని, ఉద్యోగం రాలేదని, ఆర్ధిక సమస్యలు వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ కుటుంబంలోని నలుగురు సూసైడ్ (Suicide) చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసం ఉంటున్న కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరు శుక్రవారం నుంచి ఇంట్లో నుండి బయటకు రాలేదు. దీనితో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. వారి మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి వచ్చాయి. మృతులు నాగరాజు (Nagaraju), ఆయన భార్య సుజాత (Sujatha), పిల్లలు రమ్యశ్రీ, టిల్లులుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.
రాష్ట్ర రాజధానిలో హత్యలు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. చిన్న చిన్న వివాదాలు, ఆర్ధిక సమస్యలతో నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వందేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ప్రతీదానికి చావే కారణం కాదు. చనిపోయి సాధించేది ఏమి లేదు. బ్రతికి సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పటివరకు భార్య, భర్త పిల్లలతో హాయిగా బ్రతికిన ఆ కుటుంబంలో ఇప్పుడు పెను విషాదం మిగిలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Family suicide, Telangana