Home /News /telangana /

FOUR MEMBERS GANG RAPE ON INTER STUDENTS IN RAJANNA SIRCILLA DISTRICT FULL DETAILS HERE HSN

ఇంటర్ యువతిని నలుగురు యువకులు ఓ ఇంటికి తీసుకెళ్లి.. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మూడ్రోజుల పాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో ఓ 16ఏళ్ల యువతి ఇంటర్మీడియట్ చదువుకుంటోంది. ఆ బాలిక ఉంటున్న ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. తన మాటలతో మభ్యపెట్టి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం నటిస్తూ ఆమెతో చనువును ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత..

ఇంకా చదవండి ...
    తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఏకంగా మూడు రోజుల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై లైంగికదాడి చేశారు. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి చేస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియోను తీశారు. స్నేహం పేరుతో నమ్మించి ఓ ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చిన తర్వాత ఈ దారుణానికి తెగబడ్డారు. మూడ్రోజుల తర్వాత ఆ బాలికను వదిలేశారు కానీ, ఆమెపై బెదిరింపులను మాత్రం ఆపలేదు. ఆ బాలికనే కాదు, ఆ బాలిక తల్లిదండ్రులను కూడా వారు బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. దీంతో వారి వేధింపులకు తాళలేక ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో ఓ 16ఏళ్ల యువతి ఇంటర్మీడియట్ చదువుకుంటోంది. ఆ బాలిక ఉంటున్న ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెపై కన్నేశాడు. తన మాటలతో మభ్యపెట్టి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం నటిస్తూ ఆమెతో చనువును ఏర్పరచుకున్నాడు. మూడు రోజుల క్రితం ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందని చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. తనతోపాటు గంజాయికి అలవాటు పడిన మరో ముగ్గురు యువకులు కూడా అక్కడకు చేరుకున్నారు. మొదట వారంతా అమాయకుల్లా కనిపిస్తూ మాట్లాడారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిఇచ్చారు. అది తెలియని ఆమె ఆ కూల్ డ్రింక్ ను తాగింది. ఆ తర్వాత అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను నగ్నంగా మార్చి ఫొటోలు, వీడియోలు తీశారు. మెలకువ వచ్చిన తర్వాత వాటిని చూపి ఆమెను బెదిరించారు. తమకు సహకరించమని డిమాండ్ చేశారు. ఆమె ఒప్పుకోకున్నా బలవంతంగా ఆ బాలికపై అత్యాచారం చేశారు.

    మూడు రోజుల పాటు ఆ నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. అశ్లీల దృశ్యాలను వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. మూడు రోజుల పాటు కనిపించకుండా ఎక్కడకు వెళ్లావని ఆ బాలికను తల్లిదండ్రులు నిలదీస్తే అసలు విషయం చెప్పిందామె. అయితే ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా తెలిసిందని, ఆ నలుగురు కీచక గ్యాంగ్ కు తెలిసిపోయింది. దీంతో వారు నేరుగా ఆ బాలిక తల్లిదండ్రులను కూడా బెదిరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Disa Rape and Murder, Gang rape, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు