యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో అపశుత్రి.. నలుగురు కార్మికులు..

క్షతగాత్రులను తొలుత యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి.. అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

news18-telugu
Updated: May 20, 2020, 2:02 PM IST
యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో అపశుత్రి.. నలుగురు కార్మికులు..
యాదాద్రి (ఫైల్)
  • Share this:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పనుల్లో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. వైటీడీఏ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంలోని 6వ విల్లాలో బేస్‌మెంట్ స్లాబ్ కూలీ నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను తొలుత యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి.. అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన వారు శ్రీకాకుళం, మహబూబ్‌ నగర్ వాసులుగా గుర్తించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పక్కనే ఉన్న మరో గుట్టపై దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో వీవీఐపీ భక్తుల కోసం 20 వరకు ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాల నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్ యాదాద్రి కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే యాదాద్రిపై ప్రత్యేక దృష్టి సారించారు.
Published by: Narsimha Badhini
First published: May 20, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading