(K.Lenin,News18,Adilabad)
ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు(Car)ను కంటైనర్ (Container)ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు(Four killed)అక్కడిక్కడే మృతి చెందారు. సోమవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది. గుడి హత్నూర్ (Gudihatnoor)మండలంలోని సీతాగొంది దగ్గర జరిగిన ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్ (Hyderabad)నుంచి ఆదిలాబాద్‌కు కారులో వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతులు ఆదిలాబాద్‌కు చెందిన వాళ్లుగా పోలీసులు(Police)గుర్తించారు.
రక్తంతో తడిసిన రహదారి..
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున రహదారి రక్తంతో తడిసింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తున్న కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. గుడిహత్నూర్ మండలం సీతాగొంది దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉండగా చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పురుషులు ఓ మహిళ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
తిరిగి రాని లోకాలకు..
తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరగినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ రఫముల్లా అహ్మద్, శభియా హష్మీ, సయ్యద్ వజాహద్తో పాటు కారు డ్రైవర్ శంషోద్దిన్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యలో సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడటంతో వెంటనే రిమ్స్‌కు తరలించారు. చికిత్స అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Road accident, Telangana News