Home /News /telangana /

FOUR GIRLS STARTED CAMPAIGN AGAINST SEXUAL HARASSMENT IN A BUS OF TSRTC GH VB

TSRTC-Women Power: 'బస్సులో భరోసా'.. హైదరాబాద్ లో వాటికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు..

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తో మహిళలు

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తో మహిళలు

మహిళలపై లైంగిక వేధింపుల గురించి దశాబ్దాల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో చట్టాలు చేశారు. చర్యలూ చేపట్టారు. కానీ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఎప్పటికప్పుడు ఈ విషయంలో నూతన సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను ఉపయోగించుకునే ఎంతోమంది ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, ఈవ్-టీజింగ్ వంటివి కోకొల్లలు. వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు నలుగురు హైదరాబాదీ మహిళలు.

ఇంకా చదవండి ...
(Mirza Ghani Baig | News18 | Hyderabad)

మహిళలపై లైంగిక వేధింపుల గురించి దశాబ్దాల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో చట్టాలు చేశారు. చర్యలూ చేపట్టారు. కానీ 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఎప్పటికప్పుడు ఈ విషయంలో నూతన సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణాను ఉపయోగించుకునే ఎంతోమంది ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, ఈవ్-టీజింగ్ వంటివి కోకొల్లలు. వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు నలుగురు హైదరాబాదీ మహిళలు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆవాజ్-ఈ-తెలంగాణలో భాగంగా బస్సులో భరోసా (#BusloBharosa) అనే ఆన్ లైన్ క్యాంపైన్ ప్రారంభించారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడే WomComMatters అనే సంస్థ ఆవాజ్‌- ఈ- తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Lovers Serious Decision: కులాలు వేరుకావడమే వారు చేసిన తప్పా.. కుల గజ్జి ఎంత పని చేసిందో చూడండి..


బడ్డింగ్ ఛైల్డ్ రైట్స్ కార్యకర్త హిమబిందు నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆమె స్నేహితులు కౌముది నాగరాజు, నిఖిత, జైనా ఇందులో భాగమయ్యారు. వీరితో పాటు సింధూజ, సమృద్ధి, శ్రీచరణ్, మహేశ్ అనే నలుగురు వాలంటీర్లుగా చేరారు. బస్సు, మెట్రోలు లాంటి ప్రజా రవాణా సమయంలో లైంగిక వేధింపులను అరికట్టాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మహిళల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రతిస్పందన వస్తోంది. బస్సుల్లో పోస్టర్లను అతికించి ఆడవాళ్లకు ఈ విషయంపై అవగాహన కల్పించడంలో తాము విజయం సాధించినట్లు ఈ మహిళా బృందం స్పష్టం చేసింది. ప్రయాణం చేస్తున్నప్పుడు మహిళలపై స్టాకింగ్, ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.ప్రజారవాణాలో లైంగిక వేధింపులు..
కళాశాలలకు వెళ్లే బాలికలు, పనిచేసే మహిళలు గమ్యస్థానానికి చేరుకోవడానికి తరచూ ప్రజారవాణానే ఉపయోగించుకుంటారు. ప్రత్యేకించి రద్దీగా ఉండే బస్సుల్లో ఈ సామాజిక దురాచారాన్ని వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని ఈ బృందం చెబుతోంది. ఈ ప్రచారం వల్ల నేరస్తుల ఆగడాలకు చెక్ పెట్టవచ్చని, ఫలితంగా మహిళల్లో మనోబలం పెరుగుతుందని స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఈ ప్రచారానికి నేతృత్వం వహిస్తున్న హిమబింధు స్పష్టం చేసింది.

ప్రేమించాడు.. ఆమెతో ఎన్నో కలలు కన్నాడు.. ప్రేమను ప్రపోజ్ చేసేసరికి ఆమె చెప్పిన సమాధానం ఎంటో తెలుసా.


రద్దీ కారణంగా తమతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తులను చాలా మంది గుర్తించలేకపోయారని ఆమె వివరించారు. బస్సుల్లో మహిళలకు సీట్లు రిజర్వ్ చేసినప్పటికీ అవి వారికి సరిపోట్లేదని అన్నారు. ప్రజలు చట్టానికి, శిక్షలకు భయపడాలని తాము కోరుకోవట్లేదని, అయితే పబ్లిక్ లో ఎలా ప్రవర్తించాలో వారు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. 21 నుంచి 41 సంవత్సరాల వయస్సు గల 13 మందితో ఈ అంశంపై సామూహిక బృంద చర్చ నిర్వహించామని, ఇందులో మహిళలు, విద్యార్థులు, మహిళా బస్సు కండక్టర్లు పాల్గొన్నారని తెలిపారు. బస్సుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇందులో వివరించారని అన్నారు. ఇందులో భాగంగా చాలా మంది తమ స్పందనలను తెలియజేశారు.

సందేశాలతో సామాజిక స్పృహ..
వీరిలో 85 శాతం మంది మహిళలు రోజూ బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు. 69 శాతం మంది తమకు సురక్షితంగా అనిపించలేదని పేర్కొన్నారు. కళాశాలకు వెళ్లే బాలికలు, మహిళల్లో 100 శాతం మంది తాము లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తమకు షాకింగ్ గా, భయంగా అనిపించిందని 39 శాతం మంది స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల విషయంలో తప్పకుండా అవగాహన కల్పించాలని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ప్రవర్తన మారుతుందని 77 శాతం మంది తమ స్పందనను తెలియజేశారు.

లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టర్లు, సందేశాల వల్ల మౌనాన్ని విడనాడి తమ గొంతుకను వినిపించే అవకాశముందని 85 శాతం మంది తెలిపారు. ఇటీవలే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ క్యాంపైన్ పై స్పందించారు. లైవ్ లో మాట్లాడిన ఆయన 'బస్ లో భరోసా' ప్రచారానికి మద్దతు తెలిపారు. షీ టీమ్స్, రాచకొండ పోలీసులు ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు సహాయపడతారని అన్నారు. 1560 మంది ఈ ఆన్ లైన్ ప్రచారం ద్వారా ఛేంజ్ పిటీషన్ కు మద్దతు తెలిపారని హిమబింధు ఆనందం వ్యక్తం చేశారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ను ఇన్ స్టాల్ చేయడానికి టీఎస్ఆర్టీసీ బస్సుల్లో లామినేటెడ్ పోస్టర్లను పెట్టడానికి పిటిషన్ పై సంతకం చేయాలని ఆమె కోరారు.
Published by:Veera Babu
First published:

Tags: Crime, Sexual harrassment, Womens

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు