FOUNDATION STONE LAID BY CJI NV RAMANA FOR AIMC AT HYDERBAD VRY
Hyderabad : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు భూమిపూజ.. పాల్గోన్న CJI ఎన్వీ రమణ..
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు భూమిపూజ
Hyderabad : దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ సమీపంలోని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ తో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గోని శంకుస్థాపన చేశారు.
దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ సమీపంలోని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ తో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గోని శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంర్‌దశర్మ, ఐఏఎంసీ ట్రస్టీలైన స్రుపీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంర్దన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
కాగా దేశంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్‌లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఈమేరకు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఫీనిక్స్ వీకే టవర్‌లో 25వేల చదరపు అడుగుల్లో తాత్కాలిక ఐఏఎంసీని సిద్ధం చేసి సీజేఐకి అప్పగించారు. అనంతరం శాశ్వతభవనం కోసం పుప్పాలగూడలో కేటాయించిన భూమిలో నేడు ఐఏఎంసీ భవనానికి శంకుస్థాపన జరగింది.ఇందుకు సంబంధించి ఇదివరకే జస్టీస్ ఎన్వీ రమణ ముఖమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక దీని ద్వారా అంతర్జాతీయ వివాదాల మధ్యవర్తిత్వం ద్వారా పలు కేసులకు హైదరాబాద్ వేదిక కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.