హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోండి.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు రేవంత్ విజ్ఞప్తి

Revanth Reddy: ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోండి.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు రేవంత్ విజ్ఞప్తి

టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యికోట్ల కుంభకోణం 

జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే 

అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు.

టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం కోకాపేట భూముల అమ్మకాల్లో వెయ్యికోట్ల కుంభకోణం జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు.

Revanth Reddy on Narayanapeta Kodangal Lift Irrigation: ఈ ప్రాజెక్ట్ భూ సేకరణ సర్వే తదితర అవసరాల కోసం మొదటి దశలో రూ. 133 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారని రేవంత్ రెడ్డి వివరించారు.

  Revanth Reddy News: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంతో సమావేశమయ్యారు. జలసౌధలో ఆయనను కలిసి రేవంత్ రెడ్డి.. నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై చర్చించారు. జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ లిఫ్ట్ ఇరిగేష‌న్ కోసం 2014లోనే అనుమ‌తులు ల‌భించాయని కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకోసం రూ.1450 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు.

  ఈ ప్రాజెక్ట్ భూ సేకరణ సర్వే తదితర అవసరాల కోసం మొదటి దశలో రూ. 133 కోట్లు నిధులు కూడా మంజూరు చేశారని రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి పరమేశం దగ్గర ప్రస్తావించారు. తక్షణమే ఈ ప్రాజెక్టును చేపట్టేట్లు చూడాలని ఆయనను కోరారు. ఈనెల 25వ తేదీన జరగనున్న అపెక్స్ కమిటీ అజెండాలో ఈ ప్రాజెక్ట్ అంశాన్ని చేర్చాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు నికర జలాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 69ను చైర్మన్ ప‌ర‌మేశానికి ఎంపీ రేవంత్ రెడ్డి అంద‌జేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Krishna River Management Board, Revanth reddy, Telangana

  ఉత్తమ కథలు