హోమ్ /వార్తలు /తెలంగాణ /

చంచల్‌గుడా జైలు నుంచి టీవీ9 రవిప్రకాష్ విడుదల

చంచల్‌గుడా జైలు నుంచి టీవీ9 రవిప్రకాష్ విడుదల

రవిప్రకాష్

రవిప్రకాష్

రవిప్రకాష్ కు కుకట్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పదిహేనువేల పూచికత్తు ,ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్  చంచల్‌గుడా జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో్ ఆయన ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. రవిప్రకాష్ కు కుకట్ పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పదిహేనువేల పూచికత్తు ,ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

రవిప్రకాష్ పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. నిధుల గోల్మాల్ సంబంధించి ఒక కేసు నమోదు కాగా టీవీ9 లో ఫండ్‌ను అనధికారికంగా తరలించారన్న ఆరోపణలపై రవి ప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. దీంతో పాటు గతంలో టీవీ9 ఆఫీసుకు వెళ్లిన పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా రవిప్రకాష్‌పై ఉన్నాయి. ఈ రెండు కేసులు సంబంధించి అతని పైన ఇప్పటికే 41 సీఆర్పీసీ నోటీసులిచ్చారు.

రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసినట్టు రవిప్రకాశ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఐటీ యాక్ట్ కింద కేసు సీసీఎస్ పోలీసులు ఈ కేసు పెట్టినట్టు సమాచారం. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యార

' isDesktop="true" id="350242" youtubeid="3BjwTEIwGs8" category="telangana">

First published:

Tags: Ravi prakash, Telangana, TS Police, TV9

ఉత్తమ కథలు