సరస్వతి పుత్రుడికి సాయం.. మాజీ ఎంపీ కవిత ఔదార్యం..

యువకుడికి చెక్కు అందజేస్తున్న మాజీ ఎంపీ కవిత

మహేశ్‌కు ఆ ఫీజు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు ఫీజు చెల్లించాల్సిన తేదీ దగ్గర పడుతుండడంతో మహేశ్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో సాయం చేయాలంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్విట్టర్ ద్వారా కోరారు.

 • Share this:
  కష్టపడి చదివి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఎంలో సీటు సంపాదించాడో గిరిజన యువకుడు. కానీ అందులో చేరేందుకు చెల్లించాల్సిన ఫీజు కట్టే స్థోమత లేక అల్లాడిపోయాడు. ఓవైపు రోజులు గడుస్తున్నాయి.. మరోవైపు ఫీజు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతోంది. దాంతో ఆ యువకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ యువకుడు తనకు సాయం చేయాలంటూ నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్విట్టర్‌లో సాయం చేయాలంటూ కోరాడు. దీనికి స్పందించిన మాజీ ఎంపీ కవిత ఆ యువకుడు చెల్లించాల్సిన ఫీజును అందించి తన ఔదార్యాన్ని చాటుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కూరాకుల మహేశ్.. రాంచీలోని ఐఐఎంలో సీటు సాధించారు. మహేశ్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో కాలేజీలో సీటు ఖరారు చేసుకునేందుకు అడ్మిషన్ ఫీజుగా రూ.లక్ష చెల్లించాల్సి ఉంది.

  నిరుపేద కుటుంబానికి చెందిన మహేశ్‌కు ఆ ఫీజు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు ఫీజు చెల్లించాల్సిన తేదీ దగ్గర పడుతుండడంతో మహేశ్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో సాయం చేయాలంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్విట్టర్ ద్వారా కోరారు. దీనికి స్పందించిన మాజీ ఎంపీ కవిత.. మహేష్ అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. అడిగిన వెంటనే స్పందించి, ఉన్నత ‌చదువులకు సహకరించినందుకు మహేష్ ‌కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ ‌కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

  ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకునే యువకులకు, విద్యార్థులకు పేదరికం అడ్డంకి కాదని మహేష్ నిరూపించారని కల్వకుంట్ల కవిత అన్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహేష్ ఐఐఎంలో సీటు సాధించడం పట్ల అభినందించడంతో పాటు అండగా ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయనను స్వయంగా కలిసిన కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపి రూ.లక్ష చెక్కును అందజేశారు.
  Published by:Narsimha Badhini
  First published: