(Nagaraju,News18, Nalgonda)
వైద్యో నారాయణో హరీ అంటారు. అంటే భగవంతుడు జన్మ నిస్తే....వైద్యుడు పునర్జన్మ నిస్తాడు. అందుకే వైద్యున్ని భగవంతుడితో పోల్చుతుంది మన సమాజం. వైద్యో నారాయణో హరీ అనే పదానికే పరమార్థంగా నిలిచారు మాజీ ఎంపీ, డాక్టర్. ప్రాణపాయం ఉన్న పేద గుండెను పెద్దమనసు చేసుకొని బ్రతికించారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న చిన్నారి కుటుంబంలో వెలుగులు నింపారు. మాజీ ఎంపీ ఏంటీ, డాక్టర్ ఏంటీ అని ఆశ్చర్యపోకండి..ఓ ఫేమస్ డాక్టరే మాజీ పార్లమెంట్ సభ్యులు (Former M.P)కూడా కావడం విశేషం. ఈఘటన నల్లగొండNalgonda జిల్లాలో జరిగింది. మునుగోడు(Munugodu)మండలం గూడాపూర్ Gudapurగ్రామానికి చెందిన హర్షిత్Harshith అనే పసివాడి ప్రాణం నిన్న, మొన్నటి వరకు గాల్లో దీపంలా ఉండేది. బయటకు కనిపించని ప్రాణాంతక సమస్యతో బిడ్డ పడుతుంటే చూడలేకపోయారు తల్లిదండ్రులు లావణ్యLavanya, శివశంకర్Sivashankar.
గుండెకే రంధ్రం..
నిరుపేద కుటుంబంలో పుట్టిన 11నెలల పసివాడు హర్షిత్‌కి చిన్నవయసులోనే గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్య వెంటాడింది. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించలని నిస్సహాయస్థితిలో ఉన్న హర్షిత్ తల్లిదండ్రులు లావణ్య, శివశంకర్ దంపతుల బిడ్డ గుండెకు రంద్రం ఉందనే విషయాన్ని డాక్టర్ల ద్వారా తెలుసుకొని షాక్ అయ్యారు. ఆపరేషన్ చేస్తే కాని బ్రతకడని డాక్టర్లు చెప్పడంతో అందుకోసం 10లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసి అయోమయంలో పడ్డారు. ఏడాది కూడా నిండని బిడ్డను బ్రతికించుకోవాలన్న తపన..కార్పొరేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించలేని ఆర్ధిక పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హర్షిత్ తల్లిదండ్రులకు గ్రామానికి చెందిన స్నేహితులు నర్సింహా, వేణు ద్వారా జర్నలిస్ట్ శేఖర్ తోడ్పాటు అందించారు.
పసివాడికి ప్రాణం పోశారు..
ఏడాది వయసున్న బిడ్డ ప్రాణాలు కాపాడటానికి హర్షిత్ కోసం స్వయంగా భువనగిరి మాజీ ఎంపీ దేశంలోనే ఫేమస్ డాక్టర్‌గా పేరున్న బూరనర్సయ్యగౌడ్ని సంప్రదించారు. హర్షిత్ ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రులు ఆర్ధిక స్థితిని వివరించారు. ఈ విషయంలో పేద కుటుంబానికి పెద్ద డాక్టర్‌గా పేరున్న బూరనర్సయ్యగౌడ్ తన పెద్దమనసు చాటుకున్నారు. పిల్లవాడి తల్లిదండ్రుల దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా పది లక్షలు ఖర్చుతో కూడిన గుండె ఆపరేషన్ని ఉచితంగా చేశారు. ఎలాంటి స్వార్ధం లేకుండా కేవలం ఓ పేదతల్లిదండ్రుల బాధను, పసివాడికి పునర్జన్మ ప్రసాధించాలన్న మంచి ఆలోచనతోనే డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ ఈ చొరవచూపించారు. ఏడాదిలోపున్న పసివాడికి నూరేళ్ల ఆయుష్షు నింపారు.
పెద్ద మనిషి పెద్ద మనసు..
తమ బిడ్డ ప్రాణాలు నిలబడటానికి సహాయం చేసిన డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు హర్షిత్ తల్లిదండ్రులు. అలాగే రెక్కాడితే కాని డొక్కాడని పేదరికంలో ఉన్న తమకు వైద్యం చేయించే విషయంలో సాయం చేసిన నర్సింహ, వేణు, జర్నలిస్ట్ శేఖర్ లాంటి వ్యక్తులను జీవితంలో ఎప్పటికి మర్చిపోలేమన్నారు. పసివాడి ప్రాణం నిలబెట్టడంలో తమ వంతు సాయం చేసిన డాక్టర్ బూరనర్సయ్యగౌడ్కి జీవితాంతం రుణపడి ఉంటామని హర్షిత్ తల్లిదండ్రులు లావణ్య, శివశంకర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, VIRAL NEWS