హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: సీఎం కేసీఆర్​ విమర్శలపై కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి కౌంటర్​.. ఏమన్నారంటే..?

Munugodu: సీఎం కేసీఆర్​ విమర్శలపై కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి కౌంటర్​.. ఏమన్నారంటే..?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)

మునుగోడులో (Munugodu) టీఆర్ఎస్ పార్టీ (TRS)ప్రజాదీవెన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  మునుగోడులో (Munugodu) టీఆర్ఎస్ పార్టీ (TRS)ప్రజాదీవెన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal reddy) స్పందించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని.. కనీసం సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు తీర్పుతో కేసీఆర్ దిగిపోవడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైందని.. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవం కోసమే వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయన్న కేసీఆర్ మాటలు అవాస్తవాలన్నారు. సీఎం తన ప్రాభవం కోసం బీజేపీపై నిందలు వేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

  సీఎం ఫైర్​..

  అంతకుముందు మునుగోడులో టీఆర్ఎస్ (TRS) ప్రజాదీవెన సభ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని గుర్తు చేసిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినప్పటికీ అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఫ్లోరైడ్ బాధితుడుని ఢిల్లీ తీసుకెళ్లి చూపించినా ఎవరూ కూడా మన మొర తీర్చలేదని చెప్పారు.

  కమ్యూనిస్టులతో మాట్లాడానని.. తెలంగాణలోనే (Telangana) కాదు దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నామన్నారు సీఎం. కమ్యూనిస్టులు కలిసి రావాలి.. వారు టిఆర్ఎస్ కి మద్దతు ఇస్తామన్నారని తెలిపారు. రైతుల బతుకులు బాగుండాలంటే కమ్యూనిస్టులు కలిసి రావాలన్నారు సీఎం. బిడ్డా అమిత్ షా.. నువ్వు ఎందుకు మునుగోడుకి వస్తున్నావు, ఏం ఉద్ధరించేందుకు వస్తున్నావు అంటూ కేసీఆర్​ ప్రశ్నించారు.

  Khammam: అయోమయంలో టీఆర్​ఎస్​.. పాదయాత్ర దిశగా పొంగులేటి.. ఈ ప్రస్థానం ఎందాక..? 

  మీటర్లు పెట్టం..

  అయితే మునుగోడు సభలో రైతులకు (farmers) సీఎం కేసీఆర్​ శుభవార్త చెప్పారు. కేసీఆర్ (KCR)​ బతికున్నంత వరకు రైతుల పొలాల్లో మీటర్లు (No meters) పెట్టడని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఒక వేళ బీజేపీకి ఓటేస్తే వాళ్లు వచ్చి మీటర్లు పెడుతారని ఆరోపించారు. కాంగ్రెస్​కు ఓటేస్తే వ్యర్థమేనని కేసీఆర్​ అన్నారు. మోదీకి చెందిన బడాబాబులు సూట్ కేసులతో రెడీగా ఉన్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. నేను చెప్పే మాట నిజమా ,కాదా ఆలోచించుకోవాలన్నారు. రైతుబంధు, రైతు బీమా ఎంతమందికి వస్తుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో రైతులు చనిపోతే కుటుంబం రోడ్డున పడేదని.. ఇప్పుడు రైతు చనిపోతే 10 రోజులలోపు 5 లక్షలు ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు సీఎం కేసీఆర్. మునుగోడు లో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకుకి సంబంధించినది అన్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Komatireddy rajagopal reddy, Munugodu By Election, Politics

  ఉత్తమ కథలు