Babu Mohan | మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూ మోహన్ (Babu Mohan) ఓ కార్యకర్తపై బూతులతో రెచ్చిపోయాడు. మీతో కలిసి పని చేస్తానని అందోల్ నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్త బాబూ మోహన్ కు ఫోన్ చేశారు. దీనితో నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తపై బాబూ మోహన్ (Babu Mohan) శివాలెత్తారు. మళ్లీ ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా..నేను ప్రపంచ స్థాయి నాయకుడిని..నువ్వెంత అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఎవడ్రా..వాడు నా తమ్ముడు అంటూ బాబూ మోహన్ (Babu Mohan) మాట్లాడిన ఆడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక బాబూ మోహన్ తీరుపై నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కాగా ఈ ఆడియోపై బాబు మోహన్ (Babu Mohan) ఎలా స్పందిస్తారో చూడాలి.
'హలో సార్ నేను వెంకటరమణ. హా తమ్ముడు నీ ప్రాబ్లమ్ ఏంటి. మళ్లీ మీ దగ్గరి నుంచి కాల్ వచ్చింది సార్. లక్ష ఉంటాయి. వెంకటరమణ నువ్వు ఎందుకు ఫోన్ చేశావ్. నేనెందుకు ఎత్తలేదు. టెల్ ద మ్యాటర్. ఎవరు నువ్వు అని బాబూ మోహన్ అడిగారు. సార్ నేను వెంకటరమణ. ఆ బట్టల షాపులో పని చేసే వెంకటరమణ. అవును సార్ ఆ షాపు నాదే. ఏం చేద్దాం. మీతో కలిసి పని చేద్దాం అనుకుంటున్నా సార్. కలిసి ఏం పని చేస్తావ్ అని బాబూ మోహన్ అనగా.. మీరు చెప్తే ఏదైనా చేస్తాను సార్ అన్నాడు. నిన్నటి వరకు ఎందుకు చేయలేదని బాబూ మోహన్ అడగగా.. తప్పయింది సార్. మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ వాల్యూ తెలిసింది సార్ అన్నాడు కార్యకర్త. నేను ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఎన్ని సీసీ రోడ్లు వేశాను. ఎన్ని కళ్యాణ్ మండపాలు చేశాను. నీ వయసెంత 90, 80 అని బాబూ మోహన్ అడిగాడు. కాదు సార్ 41. సార్ వాస్తవానికి అందోల్ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్దే అని' కార్యకర్త అన్నాడు.
'నువ్వెంత..నీ వయసెంత..నీ లైఫెంత. నువ్వేం చేయగలవు జోగిపేటకు. ఎన్ని ఓట్లు ఉన్నాయని బాబు మోహన్ అడగగా..2000 ఉన్నాయి సార్. ఛాలెంజా. నీకు ఎన్ని ఓట్లున్నాయి. నాకెన్ని ఓట్లు ఉన్నాయి. మీతో ఛాలెంజ్ ఏంటి సార్ అని కార్యకర్త అన్నాడు. ఏమనుకున్నావ్ రా నువ్వు. తమ్ముడు నువ్వు రికార్డింగ్ చేసినా ఏమి లేదని బాబూ మోహన్ అన్నారు. చేయట్లేదు సార్ అని కార్యకర్త అన్నారు. నువ్వెంత..నీ లైఫెంత..నీ స్థాయేంత. 2 రాష్ట్రాలకు పని చేశాను. అమిత్ షా నన్ను జాయిన్ చేసుకున్నారు. మీ ఇంటికొచ్చి కాఫీ తాగానురా గాడిద. వెధవ అని బాబూ మోహన్ కార్యకర్తను ఉద్దేశించి అన్నారు. స్వారీ..స్వారీ సార్ అని కార్యకర్త చెప్పగా. స్వారీ నాకు కాదు పార్టీకి చెప్పాలి. పార్టీకి చెబుతాను. మీకు చెబుతాను సార్ అని కార్యకర్త అన్నాడు. నువ్వెంత..రేపు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చెయ్యి. అరే గాడిద. బండి సంజయ్ ఎవడ్రా. వాడు నా తమ్ముడు రా అని బాబూ మోహన్ అన్నారు. బండి సంజయ్ అన్న ముందు మీకు స్వారీ చెబుతా సార్. బండి సంజయ్ ముందు మాకు స్వారీ చెప్పడం అవసరం లేదు. నేను ప్రపంచ స్థాయి రా. 11 రాష్ట్రాలలో బీజేపీ తరపున ప్రచారం చేయించుకుంది బీజేపీ. నేను చేయలేదు. ఫోన్ పెట్టెయ్ ఫస్ట్. స్వారీ..ప్లీజ్ సార్. నాకు నువ్వు, నీ ఓట్లు అవసరం లేదని' బాబూ మోహన్ అన్నారు.
'సార్ మీకంటే ముందు నుండే నేను బీజేపీలో ఉన్నానని కార్యకర్త అన్నగా.. మరి నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి. నాకెన్ని ఉన్నాయని బాబూ మోహన్ అడిగారు. నేను రాష్ట్ర నాయకుడిని. నువ్వు వార్డు నాయకుడివి. ఇంకోసారి ఫోన్ చేయకు. నేను బీజేపీ నాయకుడిని ఫోన్ చేయొద్దంటే ఎలా. మీకంటే ముందు నుంచి పార్టీలో ఉన్నానని కార్యకర్త అన్నారు. ఇక ఆపై మరింత రెచ్చిపోయి ఇంకోసారి ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా అంటూ బాబూ మోహన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేపే బీజేపీ అభ్యర్ధికి రాజీనామా చేస్తానంటూ' బాబూ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babu Mohan, Bandi sanjay, Bjp, Telangana