• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • FOREST OFFICIALS CLARIFIES ON LEOPARD ATTACK IN GACHIBOWLI REGION OF HYDERABAD IN TELANGANA AK

Leopard in Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో చిరుత కలకలం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Leopard in Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో చిరుత కలకలం.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

Leopard in Hyderabad: హైదరాబాద్ శివార్లలోని గచ్చిబౌలిలో చిరుత దాడి చేసిందనే అంశంపై అటవీ అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టారు.

  • Share this:
    తెలంగాణలోని అసిఫాబాద్, ఖమ్మం జిల్లాలను పెద్దపులి భయపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ శివార్లలోని గచ్చిబౌలి ప్రాంతంలో చిరుతపులి వచ్చిందనే వార్త చాలామందిని టెన్షన్ పెట్టింది. గచ్చిబౌలిలోని రోడా మిస్త్రీ కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ చిరుత క్షణాల్లో పరుగున వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌ఓ భీమానాయక్‌కు సమాచారమివ్వడంతో చిలుకూరు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రతిమ కాలేజీని సందర్శించి భవనం మెట్లపై రక్తపు మరకలను గుర్తించారు. కాలేజీ భవనంపై నుంచి పక్కనే ఉన్న గుట్టలోకి అది దూకి ఉంటుందని భావిస్తున్నారు.

    కుక్క కనిపించడం లేదని, అధికసంఖ్యలో కోతులు కూడా ఉన్నాయని అక్కడున్న వారు తెలిపారు. అయితే అటవీ ప్రాంతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న చోటుకు చిరుత రావడం పెద్దగా జరగదని అధికారులు తెలిపారు. కోతులు, కుక్కలను చిరుత వేటాడుతుందని అన్నారు. ఒకసారి వేటాడితే.. ఆ ఆహారం రెండు మూడు రోజులు దానికి సరిపోతుందని అన్నారు. ఆ తరువాత మళ్లీ చిరుత బయటకు వస్తుందని వివరించారు. బాధితులు చెప్పినట్టు కుక్కకు సంబంధించిన రక్తపు మరకలు కనిపించినా... చిరుత పాదముద్రలు మాత్రం కనిపించలేదని అన్నారు. అయితే కుక్కపై దాడి చేసింది చిరుతపులేనా లేక ఇతర జంతువా అనే విషయాన్ని గుర్తిస్తామని అన్నారు. ఇందుకోసం ఈ ప్రాంతంలో ట్రాక్‌ కెమెరాలను అమర్చుతామని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: