హోమ్ /వార్తలు /తెలంగాణ /

Adilabad : కస్తూర్భా స్కూల్ విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో చికిత్స...

Adilabad : కస్తూర్భా స్కూల్ విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో చికిత్స...

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని

Adilabad : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుఠాహుటిన జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి తరలించారు. సుమారు 46 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాగ్ పాఠశాలలో ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేరుకున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. ఉదయం టిఫిన్ లోకి తీసుకున్న పల్లీ చట్నీ వలననే అస్వస్థతకు లోనైనాట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులంతా రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెబుతున్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిమ్స్ ను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థినులు అస్వస్థతకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత కూడా రిమ్స్ ను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.

First published:

Tags: Adilabad, School girl

ఉత్తమ కథలు