హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad: భలే భలే రెడ్ బకెట్.. నోరూరించే ఈ బిర్యానీకి ఫుడ్ లవర్స్ ఫిదా

Nizamabad: భలే భలే రెడ్ బకెట్.. నోరూరించే ఈ బిర్యానీకి ఫుడ్ లవర్స్ ఫిదా

రెడ్ బకెట్ బిర్యానీ

రెడ్ బకెట్ బిర్యానీ

Nizamabad: నిజామాబాద్ నగరంలో ఇప్పటికే.... జైల్ హోటల్ మండి, అరేబియన్ మండీస్,  ట్రైన్ హోటల్,  రోబో వేటర్,  హోటల్ హబ్స్ ఇలా చాలా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రెడ్ బకెట్ బిర్యానీ ఫుడ్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(పి.మహేందర్, న్యూస్ 18 తెలుగు, నిజామాబాద్)

బిర్యానీ అంటే హైదరాబాద్...! హైదరాబాద్ అంటే బిర్యానీ..!  ఈ రెండింటికీ అంత కనెక్షన్ ఉంది మరి..!  హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఫుడ్ లవర్స్ పడిచస్తారు.  ఐతే ఇప్పుడు నగరంలో మాత్రమే కాదు.. జిల్లాలకు కూడా బిర్యానీ రుచులు విస్తరించాయి. హైదరాబాద్‌కు మించిన రుచితో.. బిర్యానీ దొరుకుతోంది. నిజామాబాద్ నగరం కూడా ఫుడ్ లవర్స్‌కి అడ్డాగా మారుతోంది.  భోజన ప్రియులను ఆక‌ర్షించేసేందుకు హోటల్ యజమానులు వివిద ర‌కాల పూడ్ ను ప‌రిచయం చేస్తున్నారు. నగరంలో ఇప్పటికే.... జైల్ హోటల్ మండి, అరేబియన్ మండీస్,  ట్రైన్ హోటల్,  రోబో వేటర్,  హోటల్ హబ్స్ ఇలా చాలా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రెడ్ బకెట్ బిర్యానీ ఫుడ్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

ఒక పర్సన్ నుంచి 8 మంది తినేలా బకెట్ బిర్యానీ అందుబాటులో ఉంది. అదిరిపోయే రుచితో బకెట్ బిర్యానీని ఆస్వాదిస్తున్నారు ఫుడ్ లవర్స్. రేట్లు కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా చూశారు నిర్వాహకులు. తాజా తాజాగా వేడి వేడి బిర్యానిని అప్పటికప్పుడే రెడీ చేసి బిర్యానీ ప్రియులకు అందిస్తున్నారు.  200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు రెడ్ బకెట్ బిర్యానిని అందుబాటులో ఉంది. ఫ్యామిలీ కి సరిపడేలా అంతకంటే ఎక్కువ మంది ఉన్నా కడుపు నిండా పుష్టిగా తినేలా బకెట్ బిర్యానీ ఇస్తున్నారు.

నగరంలో మొదటి సారిగా బకెట్ బిర్యానిని తామే  అందుబాటులోకి తీసుకురావటం ఆనందంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.  ''మా వ‌ద్ద ఒక్క‌రికి స‌రిప‌డే బిర్యాని బ‌కెట్ నుంచి ఎనిమిది మందికి స‌రిప‌డ బిర్యానీ బ‌కెట్ వ‌ర‌కు అందుబాటులో ఉంచాం. మా వ‌ద్ద ఓన్లీ పార్స‌ల్ మాత్ర‌మే ఇస్తాము  బిర్యానీ తో పాటు బకెట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్యామిలీకి కంఫర్ట్‌గా ఉంటుంది. అని న్యూస్ 18తో  చెప్పారు

బిర్యానీ టేస్ట్ చాలా బాగుందని... హైదరాబాద్‌లో తిన్నట్లుగానే ఉందని కస్టమర్లు చెబుతున్నారు.   రెడ్ బకెట్ బిర్యానీ ఫ్యామిలికి సూపర్‌గా సరిపోతుందని భోజ‌న ప్రియుడు రాజేశ్  తెలిపారు.  చికెన్ దమ్ బిర్యానీతో పాటు, చికెన్ టిక్కా బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా వివిధ రకాల వెరైటీలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

First published:

Tags: Chicken biryani, Nizamabad

ఉత్తమ కథలు