news18-telugu
Updated: September 2, 2020, 1:01 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో ఇటీవల గోదావరి నది ఉద్ధృతి తగ్గింది. ఐతే ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. తెలంగాణలో గోదావరి నదికి, ప్రాణహితకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాణహితలో వరద ఉద్ధృతి పెరగడంతో కాళేశ్వరం బ్యారేజీల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం ఘాట్ వద్ద 12.37 అడుగుల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు కాళేశ్వరం వద్ద గోదావరి నదికి ప్రత్యేక పూజలు, పుణ్య స్నానాలను నిలిపివేశారు. నది వద్దకు ఎవరూ రాకుండా గేట్లు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలోనూ గోదారి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో నదీ పరీవాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
Published by:
Shiva Kumar Addula
First published:
September 2, 2020, 12:59 PM IST