FLEXES WERE REMOVED OF YS SHARMILA AT LOTUSPOND BY GHMC DRF TEAM IN MIDNIGHTVRY VRY HYD
YS Sharmila : షర్మిలకు మరోషాక్... ఇంటిముందు ఫ్లెక్సీల తొలగింపు..ఆర్థరాత్రి అభిమానుల ఆందోళన
YS Sharmila : షర్మిలకు మరోషాక్... ఇంటిముందు ఫ్లెక్సీల తొలగింపు..ఆర్థరాత్రి అభిమానుల ఆందోళన
YS Sharmila : వైఎస్ షర్మిలతో పాటు ఆమె అభిమానులకు మరోషాక్ తగిలింది..పార్టీ అభిమానులు లోటస్‌పాండ్‌లోని వైఎస్ షర్మిల ఇంటివద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం అర్థరాత్రీ తొలగించింది.దీంతో పార్టీ ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్న షర్మిలకు మరిన్ని షాక్‌లు తగలనున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వైఎస్ షర్మిల మరో వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.. వైఎస్ షర్మిల చేపట్టిన పలు కార్యక్రమాలకు మొదట్లో సహకరించిన తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం రానురాను ఆ పార్టీ కార్యక్రమాలపై నిర్బంధం కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే నేడు లోటస్ పాండ్‌లో టీమ్ వైఎస్ఎస్ఆర్ పేరిట ఓ వెబ్సైట్ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు లోటస్‌పాండ్ ఆవరణలో ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. అయితే... మంగళవారం రాత్రి పన్నెండు గంటలకు నగర పాలక సంస్థకు చెందిన డీఆర్ఎఫ్ టీం లోటస్ పాండ్‌కు చేరుకుని మొత్తం ఫ్లెక్సీలను తొలగించింది. ఫ్లెక్సీలపై స్థానిక మాజీ కార్పోరేటర్ ఫిర్యాదు చేయడంతో వీటిని తొలగిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.
అయితే ఈ చర్యలపై షర్మిల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ బృందం చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. అనేక మంది రాజకీయ నాయకుల ఇళ్ల ముందు ప్లేక్సీలు వెలిశాయని..వాటిని అన్నింటిని తీసే దమ్ము మున్సిపల్ అధికారులు ఉందా అని ప్రశ్నించారు.
కాగా మరో వారం రోజుల్లో షర్మిల పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. కాని అప్పుడే ఆమె పార్టీకి తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అడ్డంకులు కల్గిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరోనా పరిస్థితులు ఉన్నా...ఖమ్మం సభకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అనంతరం ఆమె వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.. మొదట్లో ఆమెపై ఎలాంటీ విమర్శలు చేయని నేతలు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే ఇటివల నల్గోండ జిల్లాలోని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు చుక్కెదురైంది.. షర్మిల పరామర్శించేందుకు వెళ్లిన యువకుడితో పాటు కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని పార్టీ శ్రేణులు ఆరోపణలు చేశారు. అనంతరం ఆదే జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన నేపథ్యంలోనే అనుమతి లేదంటు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
ఇప్పుడు తాజాగా ఫ్లేక్సిలను తొలగించారు. సో దీంతో షర్మిల పార్టీపై కూడా టీఆర్ఎస్ ఫోకస్ పెడుతుందా..అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. పార్టీ ఏదైనా ముందునుండే దెబ్బకొట్టాలనే వ్యుహాంలోకి టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లారా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మరోవైపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి కూడా వివాదం చెలరేగడం కూడా ఈ చర్యకు కారణం అని చెబుతున్నారు. అయితే నీటీ ప్రాజెక్టులకు సంబంధించి షర్మిల స్పష్టమైన ప్రకటన చేసింది..తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి పోరాటం చేస్తామని, చుక్క నీరు కూడా తెలంగాణ వాటా నుండి పోనియ్యమని స్పష్టం చేసింది. అయితే ఇక ముందు కూడా తెలంగాణ అధికారులు, టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఇలాగే వ్వవహరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.