Mahabubnagar : మరో చిన్నారీపై అత్యాచారం.. విషయం బయటకు రాకుండా మహిళా నేత రాజీ..

ప్రతీకాత్మక చిత్రం (Image credit:istock)

Mahabubnagar : మరో అయిదేళ్ల చిన్నారీని యువకుడు అత్యాచారం సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే దీనిపై బాధిత కుటుంబం బయటికి రాకుండా ప్రజాప్రతినిధులు అడ్డుకున్నట్టు సమాచారం. మరోవైపు పోలీసులకు కూడా సమాచారం లేకుండా వ్యవహారం చక్కపెట్టిన సంఘటన మహబుబ్‌నగర్‌లో చేటు చేసుకుంది.

  • Share this:
    న్యూస్ 18 మహబూబ్ నగర్...
    సయ్యద్ రఫీ...
    పిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు.. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు కొన్ని బయటకు వస్తుంటే మరికొన్ని మాత్రం గ్రామ పెద్దల సంధితో అక్కడే సమసిపోతున్నాయి. దీంతో నయానా, భయాన బాధితులను లొంగదీసుకుంటున్న వెలుగు చూస్తున్నాయి.

    ఇటివల హైదరాబాద్ (Hydrbad ) సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం , హత్య జరిగిన సంఘటన మరవక ముందే మరో సంఘటన వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ (Mahabubnagar )జిల్లా జడ్చర్ల లోని ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయిదేళ్ల చిన్నారిని 25 ఏళ్ల యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ( rape )పాల్పడ్డడాని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసులో స్థానిక మహిళ ప్రజా ప్రతినిధి జోక్యం చేసుకొని ఇరు కుటుంబాల తో మాట్లాడి విషయం బయటకు రాకుండా చేశారని స్థానికులు చెబుతున్నారు..

    ఇది చదవండి : కేసీఆర్ బొమ్మతోనే అందరం గెలిచాం.. గెల్లు కూడా అలానే గెలుస్తాడు..


    ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగినా... శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు పట్టణంలోని చిన్నారి సెప్టెంబర్ 25న మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అదే కాలానికి చెందిన దినసరి కూలి గా (Daily labour )పనిచేసుకునే యువకుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు చెబుతున్నారు. అనంతరం చిన్నారిని అక్కడ వదిలి పరారయ్యాడు. కొంత సమయం తర్వాత బాలిక అస్వస్థత కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి ( hospital ) తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అత్యాచారం జరిగినట్లు చెప్పారు.

    ఇది చదవండి : న్యూయార్క్ లాంటీ నగరాలే మునిగిపోతున్నాయి.. అయినా.. రజనీకాంత్ మృతికి మాదే భాద్యత


    దీంతో తల్లిదండ్రులు కాలనీకి వచ్చి ఆరా తీయగా యువకుడి అఘాయిత్యం తెలిసింది. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు ( police )ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఓ మహిళ ప్రజా ప్రతినిధి జోక్యం (woman leader )చేసుకున్నారు. రెండు కుటుంబాల వారితో మాట్లాడి రాజి కుదిరిన చడంతో ఈ విషయం బయటకు రాలేదని చెబుతున్నారు. అయితే ఇదే విషయంపై పోలీసులకు కూడా సమాచారం లేదని చెప్పడం విశేషం.

    ఇది చదవండి : హరిత నిధికి అప్పుడే నిధులు..... విరాళాలు ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధులు..

    Published by:yveerash yveerash
    First published: