సూర్యాపేటలో కలకలం.. టపాసుల కోసం బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యం..

ప్రతీకాత్మక చిత్రం

సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. టపాసుల కోసం బయటకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు.

 • Share this:
  సూర్యాపేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. టపాసుల కోసం బయటకు వెళ్లిన బాలుడు కనిపించకుండా పోయాడు. ఎంతసేపటికి బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. సూర్యాపేట భగత్‌సింగ్ నగర్‌కు చెందిన పరికపల్లి మహేష్, నాగలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు గౌతమ్(5). దీపావళి సందర్భంగా శనివారం సాయంత్రం టపాసులు కొనుక్కునేందుకు గౌతమ్ పక్కనే ఉన్న షాప్‌కి సైకిల్‌పై వెళ్లాడు. ఆ తర్వాత బాలుడు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. అతడి తల్లిదండ్రులు షాప్ వద్దకు వెళ్లి వెతికారు.

  అయితే గౌతమ్ ఆచూకీ కనిపించలేదు. అయితే బాలుడు తీసుకెళ్లిన సైకిల్ మాత్రం కిరాణ షాప్‌కు కొద్ది దూరంలో కనిపించింది. దీంతో ఆందోళన చెందిన గౌతమ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడు ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఎవరైనా గౌతమ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

  మరోవైపు గౌతమ్ తమ వద్దే ఉన్నాడని ఓ గుర్తు తెలియని వ్యక్తి.. ఆ ప్రాంతంలో ఉన్న ఓ లేడీ టైలర్ షాప్‌కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. అతడి మాటలపై అనుమానంతో ఆ టైలర్ షాప్ వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సేకరిస్తున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: