హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : కూల్‌ డ్రింక్ బాటిల్ నోట్లో పెట్టుకున్నందుకు ఐదేళ్ల చిన్నారికి ఎంత శిక్ష పడిందో తెలుసా..?

Sad news : కూల్‌ డ్రింక్ బాటిల్ నోట్లో పెట్టుకున్నందుకు ఐదేళ్ల చిన్నారికి ఎంత శిక్ష పడిందో తెలుసా..?

sad news

sad news

sad news: ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నీళ్లేవో ..పాలేవో కూడా తెలియని వయసున్న ఆ చిన్నారి కూల్ డ్రింక్ అనుకొని ఏం తాగిందో తెలుసా..? తర్వాత ఏం జరిగిందంటే..

  • News18 Telugu
  • Last Updated :
  • Asifabad, India

(K.Lenin,News18,Adilabad)

ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటార. కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నీళ్లేవో ..పాలేవో కూడా తెలియని వయసున్న ఆ చిన్నారి కూల్ డ్రింక్(Cool drink) అనుకొని పురుగుల మందు(Insecticide)తాగి ప్రాణం కోల్పోయిన విషాదకర సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్(Komuram Bhim Asifabad)జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటూ అందర్ని నవ్విస్తున్న ఐదేళ్ల చిన్నారి( Five year girl)కి పెద్దల నిర్లక్ష్యం కారణంగా నూరేళ్లు నిండాయన్న వార్త అందర్ని తీవ్రంగా కలచి వేసింది.

Mystery: హాస్టల్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం .. నరబలి కోసం అంతకు తెగించారా..!

కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగుల మందు..

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, లావణ్య దంపతులకు ఐదు సంవత్సరాల కుమార్తె శాన్వి ఉంది. సోమవారం తన పెద నాన్న ఇంటి వద్ద ఆడుకుంటోంది. అయితే పంటకు పిచికారి చేసిన పురుగుల మందు కొంత మిగిలిపోవడంతో దాన్ని ఓ కూల్ డ్రింక్ బాటిల్‌లో లో పోసి ఉంచారు. కూల్‌డ్రింక్‌ బాటిల్‌లో ఉన్నది పురుగుల మందు అని గ్రహించలేని చిన్న పిల్ల ఆడుకుంటూ వెళ్లూ బాటిల్‌ తీసుకుంది. అది నిజంగా కూల్ డ్రింకేమోనని తాగింది. పెద్దనాన్న ఇంట్లో తాగిన పురుగుల మందు ప్రభావంతో అక్కడి నుంచి తల్లిదండ్రులు ఇంటికి వెళ్లింది.

తెలియకుండా తాగిన చిన్నారి..

చిన్నారి శాన్వీ ఇంటికి రాగానే వాంతులు చేసుకోవడంతో అందరూ కంగారుపడిపోయారు. కుటుంబ సభ్యులు చిన్నారిని తీసుకొని హుటాహుటిన కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు మంచిర్యాల జిల్లా కేంద్రానికి సిఫారసు చేయడంతో చిన్నారి త్లలిదండ్రులు ఆ పాపను మంచిర్యాలకు తీసుకువచ్చారు. కాని అక్కడ పలు ఆసుపత్రులకు తీసుకువెళ్లినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఎవరూ పసిపాపను ఆసుపత్రిలో చేర్పించుకోలేదు.

Crime News : బీర్‌ సీసా ముక్కతో వివాహిత గొంతు కోసిన ఎమ్మెల్యే పీఏ .. ఆ కోరిక తీర్చను అన్నందుకే ..

ఐదేళ్లకే నూరేళ్లు నిండిన పసిపాప..

ప్రాణపాయంలో ఉన్న బిడ్డను పట్టుకొని సుమారు పది హాస్పిటల్స్ తిరిగారు శాన్వీ కుటుంబ సభ్యులు. చివరగా ఓప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతోనే అక్కడి వైద్యులు అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు ధృవీకరించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ గారాల పట్టి ఇలా అర్ధాంతరం మృత్యుఒడిలోకి చేరిపోవడంతో తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చిన్నారి శాన్వి గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. రాజేష్, లావణ్య దంపతులకు మరో కుమారుడు ఉన్నాడు.

First published:

Tags: Asifabad, Telangana News

ఉత్తమ కథలు