హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gummadi Narsaiah: ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అయినా ఎర్ర బస్సులోనే ప్రయాణం..

Gummadi Narsaiah: ఈయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అయినా ఎర్ర బస్సులోనే ప్రయాణం..

ఆర్టీసీ  బస్టాండ్‌లో గుమ్మడి నర్సయ్య

ఆర్టీసీ బస్టాండ్‌లో గుమ్మడి నర్సయ్య

Gummadi Narsaiah: ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన, ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో హైదరాబాదులో తనకిచ్చిన ఇంటి స్థలాన్ని సైతం ఆయన పార్టీకే ఇచ్చేశారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతభత్యాలు అన్ని పార్టీ పరం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Khammam | Hyderabad

(జి శ్రీనివాస్ రెడ్డి, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం ప్రతినిధి)

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న  వ్యక్తి పేరు గుమ్మడి నరసయ్య (Gummadi Narsaiah). చాలా సామాన్యంగా కనిపిస్తున్న అసామాన్యుడు. ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికై  తన ప్రాంతం పట్ల తన ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్న నాయకుడు. ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలోని ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రస్తుతం ఇంటి దగ్గరే వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతుంటారు.  గుమ్మడి నరసయ్య బుధవారం నాడు ఖమ్మం బస్టాండ్‌లో ఇల్లందు బస్సు కోసం ఎదురు చూస్తూ నిలుచున్న చిత్రం అందరినీ ఆకట్టుకుంది.

ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యేకు ఒక సీటు ఎంపీ కి ఒక సీటు రిజర్వ్ చేసి ఉంటాయి. కానీ ఏ రోజు ఆ సీట్లలో సంబంధించిన ప్రజాప్రతినిధులు కూర్చోవడం మనం చూడలేము. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం తమ స్థాయి కాదని సదరు ప్రజాప్రతినిధులు భావిస్తూ ఉంటారు. ఏదో ఒక మార్గంలో వందల వేల కోట్లు సంపాదించి లగ్జరీకారుల్లో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా  వచ్చే నాయకులను మనం చూస్తుంటాం.

కానీ గుమ్మడి నరసయ్య వీరందరికీ  భిన్నమైన వ్యక్తి. అరుదైన వ్యక్తిత్వం గల ఆదివాసీ నేత. ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తనకు దక్కిన ప్రతి ప్రతిఫలాన్ని పార్టీకి అందజేసిన అంకిత భావం గుమ్మడి నరసయ్యది. ఇప్పటికీ కేవలం పార్టీ ఇచ్చే హోల్ టైమర్ జీతంతో తన జీవితాన్ని గడుపుతున్న గుమ్మ నరసయ్య.. తనకున్న కొద్దిపాటి ఐదు ఎకరాల పొలంలో నిత్యం వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు.. ఎప్పుడైనా పార్టీ పిలుపుమేరకు సమావేశాలు సభలు ఇంకా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఖమ్మం వస్తూపోతూ ఉంటారు.

ఎమ్మెల్యేగా పదవీకాలంలో ఉన్నంతకాలం ఆయన ఒక జీప్ ని వాడేవారు. ప్రస్తుతం తాను ఆర్టీసీ బస్సు నే నమ్ముకున్నారు. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెం వెళ్లిన.. ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఖమ్మం వచ్చిన.. ఇంకా ఏదైనా ముఖ్యమైన పని మీద హైదరాబాద్ దాకా వెళ్లిన.. ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు.. తనకు తానుగా ఎవరికి తను మాజీ ఎమ్మెల్యేని అని చెప్పరు. తెలిసినవాళ్లు గుర్తించి పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆదివాసీలు గిరిజనుల జీవితాలపై, వారి కష్టసుఖాలపై అపారమైన అవగాహన ఉన్న గుమ్మడి నరసయ్య నిత్యం వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంటారు. కనీసం ఒక గన్ మెన్ ఒక అనుచరుడు ఒక సహాయకుడు కూడా లేకుండా తనకు సంబంధించిన వస్తువులను తానే మోసుకుంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుమ్మడి నరసయ్య నేటి ప్రజాప్రతినిధులకు భిన్నమైనప్పటికీ.. తప్పనిసరిగా ఆదర్శం.

 మూడేళ్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్‌పోర్ట్‌లా మారిపోతుంది ఇలా (Photo

ఆదివాసీ నేతగా ఇల్లందు నియోజకవర్గంలో నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గుమ్మడి నరసయ్య.. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని ఇల్లందు నియోజకవర్గంలో నుంచి సీపీఐ (ఎంఎల్) పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. అప్పటినుంచి 1985, 1989, 1999, 2004 లలో  గెలుపొందారు. ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన, ప్రభుత్వం ఎమ్మెల్యే కోటాలో హైదరాబాదులో తనకిచ్చిన ఇంటి స్థలాన్ని సైతం ఆయన పార్టీకే ఇచ్చేశారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతభత్యాలు అన్ని పార్టీ పరం చేశారు. మాజీ ఎమ్మెల్యేగా తనకొచ్చే ప్రభుత్వపరమైన పెన్షన్ బెనిఫిట్స్ అన్ని పార్టీకే ఇచ్చారు. తను కేవలం పార్టీ హోల్ టైమర్ గా ఇచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు. 70 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ తన భృతిని తాను సంపాదించుకుంటున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆయనకు బాగా పట్టున్న కొన్ని మండలాలు పినపాక నియోజకవర్గంలోకి వెళ్లడంతో గుమ్మడి నరసయ్య ఓటమిపాలయ్యారు.

ఇక అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. సమకాలిన  రాజకీయాల్లో ఇలాంటి నేతలు కూడా ఉన్నారంటే నమ్మలేని పరిస్థితి. గిరిజన కోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మడి నరసయ్య  ఆదివాసి హక్కుల పట్ల  ఎన్నో పోరాటాలు నిర్మించారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా బషీర్బాగ్ ఉద్యమం నిర్మాణంలో గుమ్మడి నరసయ్యది కీలకపాత్ర. సాధారణంగా కనిపించే అసాధారణ వ్యక్తిత్వం గుమ్మడి నరసయ్యది అని ఈ చిత్రం నిరూపిస్తోంది.

First published:

Tags: Khammam, Telangana, Tsrtc

ఉత్తమ కథలు