Home /News /telangana /

FIVE THOUSAND RUPEES FOR GIRL BIRTH A VILLAGE SARPANCH SCHEME VRY KNR

Karimnagar : ఇది సర్పంచ్ స్కీం.. అడపిల్లకు 5000 వేలు, ప్రసవానికి 10 వేలు..

ఆడపిల్ల పుడితే 5 వేలు

ఆడపిల్ల పుడితే 5 వేలు

Karimnagar : ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సామాజికంగా కొంతమంది ముందుకు వచ్చి తమకు నచ్చిన సహాయం చేసి సమాజ అభివృద్దికి సహాకరిస్తారు.. అయితే ఇలా ఓ సర్పంచ్ తన కార్యక్రమాలతో సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

    ( కరీంనగర్ జిల్లా..న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి.)

    ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే... కడుపులో ఉండగానే ఆడ, మగ తెలుసుకుంటూ వారిని కడతేరుస్తున్న సంఘటనలు నిత్యాకృత్యంగా మారాయి.. అందుకు కారణాలు అనేకం ఉన్నా..ఇలాంటీ సంఘటనలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పలు సంక్షేమ కార్యక్రమాలు సైతం చేపడుతోంది. పుట్టిన బిడ్డల నుండి ఆడపిల్లలకు ప్రత్యేకంగా పలు పథకాలను ప్రవేశపెట్టింది.

    అయితే ఆడపిల్లల సంక్షేమంతో పాటు వారిపై వివక్షను పారద్రోలేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన మొగ్గుంపూర్ గ్రామ సర్పంచ్ జక్కం నర్సయ్య ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఎవరైనా ఆడపిల్ల పుడితే వారికి ముందుగానే ఐదు వేల రూపాయలు వారి పేరు మీద డిపాజిట్ చేస్తున్నారు. దీనికి అదనంగా మహిళల ప్రససం సమయంలో వారికి పదివేల రూపాయలు కూడా ఆయన స్వంతగా అందిస్తున్నారు. ఇలా శ్రీకారం చుట్టిన వెంటనే గ్రామంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టడడంతో వారికి చెరో అయిదు వేల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అందుకు సంబంధించిన పత్రాలను మండల ఎంపీంపీ చేత ఆ కుటుంబానికి ఇప్పించారు. కాగా ఈ స్కీంను పేద, ధనిక వర్గాలతో సంబంధం లేకుండా ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వారికి ఈ డబ్బులను అందించనున్నట్టు చెప్పారు.

    Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..

    కాగా ఈ కార్యక్రమానికి సర్పంచ్ గిఫ్టుకు రూపకల్పన చేసిన నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ సైతం హజరయ్యారు, ఆయన కూడా తన గ్రామంలో ఆడపిల్లకు అయిదు వేల రూపాయల కానుకను ఇస్తున్నట్టు చెప్పారు. ఇలా తనను ఆదర్శంగా తీసుకుని పలువురు సర్పంచ్‌లు ముందుకు రావడం గర్వంగా ఉందని చెప్పారు. ఇదే జిల్లాలోని గంగాధర మండలం కాచిరెడ్డి పల్లి గ్రామంలో కూడా ఇలాంటీ స్కీం ఒకటి కొనసాగుతోంది. అయితే దానికి ఫండింగ్ స్థానికంగా గల్ఫ్ వెళ్లిన వారు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సో మొత్తం మీద ఇలా వ్యక్తిగతంగా కూడా ఆడపిల్లల సంరక్షణ నిధిని ఏర్పాటు చేయడం ద్వారా.. భవిష్యత్ లో వారిపై వివక్ష లేకుండా కొనసాగే అవకాశాలు ఉంటాయని వారి భావిస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimangar, Telangana

    తదుపరి వార్తలు