Home /News /telangana /

FIVE PEOPLE FROM S FAMILY DIED AFTER WALL COLLAPSE DUE TO HEAVY RAINS IN JOGULAMBA GADWAL SK

Wall Collapse: భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వానలు పడుతున్నాయి. దీనికి తోడు శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

    హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐతే  వర్షాలకు నాని పాత గోడలు, ఇళ్లు కూలిపోతున్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలం  కొత్తపల్లిలో ఓ ఇంటి గోడ కుప్పకూలింది. ఆ ఇంట్లో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా భోజనం చేసి పడుకున్నారు. ఐతే భారీ వర్షానికి గోడ కుప్పకూలిపోయి.. ఆ శిథిలాలు వారి మీద పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. నిద్రలోనే కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు చిన్నారు ఉన్నారు. గాయపడ్డ వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను మోషా (40), శాంతమ్మ (33), చరణ్(11), రాము (9), తేజ (7)గా గుర్తించారు. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీనరు మున్నీరుగా విలపిస్తున్నారు.

    హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గురువారం రాత్రికురిసిన భారీ వర్షానికి  ఏషియన్ శివ గంగా థియేటర్ (Asian Shiva Ganga theatre) పూర్తిగా నీటమునిగింది. థియేటర్‌ ప్రహరీ కూడా కూలింది. గోడ కుప్పకూలడంతో  పార్కింగ్‌లో ఉన్న 50 బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి.

    Aasara pensions: 57 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్‌.. రేపటి నుంచే దరఖాస్తులు.. ఇలా చేయండి

    తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వానలు పడుతున్నాయి. దీనికి తోడు శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు వానలు పడతాయని పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రెండు రోజుల పాటు వానలు పడతాయని పేర్కొన్నారు.

    Telangana Rains: నేడు భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

    వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరుకున్న భవానాల్లో ఉండడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Gadwal, Telangana, Telangana rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు