వివాహితపై ఐదుగురు యజమానుల గ్యాంగ్ రేప్.. తప్పించుకుని పారిపోతున్న భార్యాభర్తల్ని బంధించి..

ఆందోళన వ్యక్తం చేస్తున్న వలస కూలీలు

ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత (22) పై ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన సదరు దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.

 • Share this:
  ఇచ్చేది అరకొర కూలీనే .. గంటల కొద్ది పని చేయక తప్పదు . అయినప్పటికీ అన్ని భరించుకుని రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అమాయక కూలీలపై ఇటుక బట్టీల యజమానులు అత్యంత దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇటీవల యజమాని నిర్లక్ష్యం వల్ల ఓ కార్మికుడిని కొందరు కొట్టి చంపగా .. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది.  వివాహిత పై ఐదుగురు ఇటుక బట్టీల యజమానులు గ్యాంగ్ రేపకు పాల్పడటమే గాక భార్యాభర్తల్ని బంధించి .. మరో 14 మంది కార్మికులను చిత్రవధకు గురిచేశారు . ఈ విషయం సఖి కేంద్రానికి తెలియడంతో రెండు వారాల తర్వాత అసలు విషయాలు మంగళవారం ఆలస్యంగా బయటపడ్డాయి. వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌరెడ్డి పేట గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్ ఎన్ సి ఇటుక బట్టిలో పనిచేసేందుకు వచ్చిన  ఒరిస్సా వివాహితపై ఐదుగురు యజమానులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత నెల 24 న పెద్దపల్లి జిల్లా గౌరెడ్డి పేటలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి (HRC) లేఖ రాయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HRC నుంచి  అధికారులకు అందిన లేఖ ప్రకారం..

  గౌరెడ్డిపేటలోని ఎల్‌ఎన్‌సీ ఇటుక బట్టీలో పనిచేసే ఒడిశాకు చెందిన వివాహిత ( 22 ) పై ఐదుగురు యజ మానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దంపతులపై దాడి చేశారు . తమకు ప్రాణహాని ఉందని భావించిన సదరు దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామం వెళ్లేందుకు రామగుండం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. వారిని పట్టుకున్న యజమానులు మళ్లీ ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. సాక్ష్యం చెబుతారనే ఉద్దేశంతో మరో 14 మంది కూలీలను నిర్బంధించి దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. స్పందించిన హెచ్చార్సీ  విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్, ఎస్సై  రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్నను సోమవారం ఆదేశించింది.

  వీరంతా ఇటుక బట్టీల వద్ద కూలీలతో మాట్లడారు. పదిమంది కూలీలు, వారి పిల్లలకు కేంద్రంలో ఆశ్రయం కల్పించామని కేంద్రం అడ్మిని స్టేటర్ స్వప్న తెలిపారు. అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో బాధితురాలు, ఆమె భర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. దీంతో యజమానులే వారిని దాచి పెట్టి ఉంటారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు యజమానులు సహకరిం చడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అత్యాచారం , కూలీల నిర్బంధంపై విచారణ జరుపుతున్నామని , త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్డీఓ తెలిపారు కాగా , గతంలో సైతం ఇదే ఇటుక బట్టీలో ఓ కూలీ మృతి చెందగా తోటి కూలీలకు తెలియకుండా యాజమాన్యం దాచి పెట్టిందని పలువురు కూలీలు గుర్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: