హోమ్ /వార్తలు /తెలంగాణ /

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తమ్మర పట్టణంలో శ్రీరామ నవమి వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

    సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. వీరంతా తమ్మర పట్టణంలో శ్రీరామ నవమి వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ప్రమాద సమయంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఆటోలో ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను కోదాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో నల్గొండ మార్గంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంపై ఇక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    First published:

    Tags: Nalgonda, Road Accident, Telangana

    ఉత్తమ కథలు