N.Naveen Kumar,News18,Nagarkurnool
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపదను పెంచి మత్స్యకారులకు ఆర్థిక అభివృద్ధిని చేపట్టేందుకుచేప పిల్లల పంపిణీ చేపట్టింది. గత 7 ఏండ్లుగాఈ చేప పిల్లలను చెరువుల్లో రిజర్వాయర్లో, కుంటల్లో వదిలి మత్స్యకారులకు ఉపాధిని అందిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2.50 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని అధికారులు ప్రణాళికలు ఏర్పాటు చేయగా వీటిలో దాదాపుగా 30 లక్షల చేప పిల్లలను కేవలం కృష్ణానది బ్యాక్ వాటర్లో వదలాలని అధికారులు నిర్ణయించారు.
అయితే వీటిని ఆసరాగా చేసుకుంటున్నా కొంతమంది పక్క రాష్ట్రానికి చెందిన దళారులు చేప పిల్లలను ఎదగకముందే వాటిని వేటాడుతున్నారు. అలవి వల ద్వారా నిషేధం ఉన్నప్పటికీని లెక్కచేయకుండా వారి దందాను కొనసాగిస్తున్నారు.రెవెన్యూ మత్స్యశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అధికారులు నాలుగు డిపార్ట్మెంట్ల అధికారులు ఫారెస్ట్ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పటికీని ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. దళారులు ఇష్టారీతిగా అలవి వలలు ఉపయోగించి చేప పిల్లలను వేటాడుతున్నారు.
దీనివలన చేప పిల్లలు ఎదగకుండానే సరైన సైజుకు రాకుండానే వేటగాళ్ల వలలకు చిక్కి బలవుతున్నాయి. చేప పిల్లలను వేటాడి వాటిని ఎండబెట్టి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక క్వింటాల్ చేప పిల్లలకు ఎండబెట్టిన చేపలకు 35వేల రూపాయలు పలుకుతున్నడంతో దళారుల వేటలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.కృష్ణ తీరంలో ఉన్న కొల్లాపూర్, పెంటలవెల్లి, చిన్నంబావి, మండలాల్లోని ఏటి ఒడ్డున గ్రామాలైన అమరగిరి, సోమశిల, మల్లేశ్వరం, మంచాలకట్ట, ఎముకల్ ,జటప్రోలు ,జలపాడు ,పెదమారు, చిన్నమారు ,వెల్లూరు, గూడెం, బెక్కం పెంట,బసవాపురం గ్రామాల్లో అలవివలల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
మహారాష్ట్ర నుంచి చేపలు పట్టేవారిని కాంట్రాక్టు మీద రప్పించి బ్రోకర్లు వారికి బోట్లు నాటు పడవలు అలవివలలు సమకూరుస్తున్నారు. రాత్రి వేళలో వేటాడుతున్నారు. మత్స్యకారులు భారీ వలలు వేసి అన్ని చేపలను వేటాడుతున్నారు. నది తీరంలో గుడిసెలు వేసుకుని ఉండేవారి కుటుంబాలు చేపలను ఎండబెట్టి కొట్టి చేపలుగా మారుస్తున్నారు. జిల్లాలోని 1060 చెరువుల్లో రిజర్వాయర్లో కుంటల్లో దాదాపు 2.50 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు ఫిషర్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేయగా కొల్లాపూర్ పెంట్లవెల్లి మండలాల్లోని కృష్ణ బ్యాక్ వాటర్ లో దాదాపు 30 లక్షల చేప పిల్లలను వదిలేందుకు సిద్ధమయ్యారు.
మరో 15 రోజుల్లో చేప పిల్లలలో వదలనట్లు సమాచారం. ప్రభుత్వం కోట్లు వెచ్చించి వదులుతున్న చేప పిల్లలు ఎదగకుండానే దళారులు అండతో ఆంధ్ర మత్స్యకారులు అలవి వలలు వినియోగించి అడుగు నుంచి లాగేస్తున్నారు. చేపలను ఎండబెట్టి తర్వాత ఆంధ్ర రాయలసీమ ఒరిస్సా మహారాష్ట్ర కోల్కత్తా వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. క్వింటాల్ ఒట్టి చేపల ధరకు 30 వేల రూపాయలు పలుకుతుందని సమాచారం. స్థానికంగా చేపలు పట్టే మత్స్యకారులు లోకల్ మార్కెట్ తో పాటు బయటకి ఎగుమతి చేస్తుండగా ఒట్టి చేపలను మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అమ్ముతున్నారు.
నిషేధించిన చర్యలు చేపట్టడం లేదు కృష్ణా నదిలో అలవివలను వాడకంపై నిషేధం ఉన్నా అధికారులు కఠిన చర్యలు చేపట్టడం లేదు. ఫారెస్ట్ రెవెన్యూ ఫిషరీస్ పోలీసులు శాఖల నిఘా ఉన్న టన్నుల కొద్దీ చేపలను బాహాటంగా ఎండబెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే అధికారులసహకారం ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది. నల్లమల్ల అడవి ప్రాంతంలో కృష్ణా నదిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా పడవలు బోట్లు నడవడం ఎంత ఈజీనా అనే విధంగా ఆపరేషన్ చేస్తున్నారు. నాలుగు డిపార్ట్మెంట్లలో ఏ ఒక్క శాఖ కూడా దళారులను అడ్డుకోవడం లేదంటే దళాలు ఎంత పవర్ ఫుల్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana