వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి...చేపల కోసం వెళ్లి..

తెప్పపై కూర్చుని వలను సరిచేసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వలలో కాళ్లు చిక్కుకోవడంతో ఎటూ కదల్లేక నీటిలో మునిగి చనిపోయాడు.

news18-telugu
Updated: May 17, 2019, 2:15 PM IST
వలలో చిక్కుకొని మత్స్యకారుడు మృతి...చేపల కోసం వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 2:15 PM IST
రెక్కొడితే కానీ డొక్కాడని బతుకులు మత్స్యకారులవి..! పొట్టుకూటి కోసం రోజుల తరపబడి చేపట వేటకు వెళ్తుంటారు. గంగమ్మ తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. చేపలను పట్టే క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. ఖమ్మం జిల్లాలో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు చనిపోయాడు. చేపల కోసం వేసిన వలలోనే చిక్కుకొని ప్రాణాలు విడిచాడు. తెప్ప నుంచి ప్రమాదవశాత్తు జారిపడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

గురువారం బచ్చోడు గ్రామంలోని ఏనెగ చెరువులో మత్స్యకారులు చేపలుపట్టారు. ఈ క్రమంలో తోటి మత్స్యకారులతో కలిసి చెన్నబోయిన రామకృష్ణ (38) చేపల వేటకు వెళ్లాడు. తెప్పపై కూర్చుని వలను సరిచేసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వలలో కాళ్లు చిక్కుకోవడంతో ఎటూ కదల్లేక నీటిలో మునిగి చనిపోయాడు. చెరువులో రామకృష్ణ కనిపించడంతో తోటి మత్స్యకారులు అతడి కోసం చెరువంతా గాలించారు. చాలా సేపటి తర్వాత వలలో చిక్కుకున్న అతడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...