అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పంపు హౌస్‌లలో గాయత్రి పంపు హౌస్ వద్ద నీటిని తాజాగా విడుదల చేశారు. దీంతో కొత్తనీరు తాకడంతో అక్కడి చేపలన్నీ ఆనందంతో ఎగిరి దుంకుతున్నాయి. ఆ దృశ్యాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. అసలు కాళేశ్వరం జలాల రాకతో ఆనందంతో పరవశించిపోతున్న అక్కడివారికి చేపలు ఎగిరి దుంకుతున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. అసలే వర్షాకాలం.. అప్పుడప్పుడు వచ్చిపోతున్న వాన చినుకుల్లో తడుస్తూ చేపలు ఎగిరుతున్న అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
వాస్తవానిని చాలామంది చేపలతో ఆడుకునేందుకు ఇళ్లలో ఆక్వేరియాలు ఏర్పాటు చేసి పెంచుకుంటుంటారు. అవి నీళ్లలో అటు ఇటు కదులుతుంటే చూసి సంబరపడుతుంటారు. అంతకుమించిన దృశ్యాలు గాయత్రి పంపుహౌజ్ వద్ద కన్పిస్తుండడంతో జనం చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.