Home /News /telangana /

FIRST TIME VACCINATION HAVE STOPED TEMPARARLY IN TELANGANA VRY

Vaccine : తెలంగాణలో మొదటి డోసు వ్యాక్సిన్ తాత్కలిక నిలిపివేత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vaccine కరోనా మొదటి డోసు వ్యాక్సినేషన్ ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ లభ్యత తక్కువగా ఉండడంతో ఈనెల 15 వరకు అన్ని ఆరోగ్యకేంద్రాల్లో మొదటి డోసును వేయడం నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అయితే సెకండ్ డోసు వేసుకునేందుకు 11 లక్షల మంది క్యూలో ఉండడంతో వారికి మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమయింది.

ఇంకా చదవండి ...
కరోనా వ్యాక్సినేషన్ పై గందరగోళ వాతవరణం నెలకోంది. మే ఒకటి నుండి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడ నిర్ణయించాయి. అయితే టీకాలు లభ్యం కావడం కష్టంగా మారింది. దీంతో వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు సెకండ్ డోస్‌ కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి డోసు వేసుకున్న వారు సెకండ్ డోసు కోసం వెయిట్ చేస్తున్నారు. మొదటి డోసు వేసుకుని ఇప్పటికే నెలలు కావస్తున్నా.. సెకండ్ డోస్ వేసుకోకపోతే మొదటి డోస్ నిరుపయోగం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సెకండ్ డోసు కోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే బుకింగ్ కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. యాప్‌లలో రిజిస్టర్ చేసుకునేందుకు లక్షలాది ప్రజలు క్యూ కట్టడడంతో రిజిస్ట్రేషన్ ఆర్థరాత్రి వరకు వేచి చూసి వ్యాక్సిన్ బుకింగ్ చేసుకుంటున్నారు.

కొవిన్ ద్వార రిజిస్ట్రేషన్ చేసుకున్నా..వ్యాక్సిన్ లభించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ఇంకా టైం స్లాట్ కేటాయించిన పరిస్థితి కనిపించడం లేదు.దీంతో మొదటి డోసుకు బ్రేకులు వేసింది తెలంగాణ ఆరోగ్యశాఖ, ముఖ్యంగా రెండవ డోసు తీసుకునే వాళ్లు 11 లక్షల మంది ఎదురుచూస్తుండడంతో వీరందరికి ముందుగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదటి డోసును నిలిపివేసింది.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Covid vaccine, Telangana

తదుపరి వార్తలు