హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఆసియాలోనే మొట్టమొదటి సారిగా నిర్మాణం.. జిగేల్ అనిపించేలా అందాలు.. ఎక్కడో తెలుసా..

Telangana: ఆసియాలోనే మొట్టమొదటి సారిగా నిర్మాణం.. జిగేల్ అనిపించేలా అందాలు.. ఎక్కడో తెలుసా..

చూపరులను ఆకర్షిస్తున్న కోమటి చెరువు అందాలు

చూపరులను ఆకర్షిస్తున్న కోమటి చెరువు అందాలు

Siddipeta: ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా మోడల్ నెక్లస్ రోడ్డును మంత్రి హరీశ్ రావు చొరవతో కోమటి చెరువు వద్ద నిర్మించారు. సమ్మర్ స్ఫెషల్ గా నెక్లస్ రోడ్డును మంత్రి కానుకగా ఇవ్వనున్నారు. ఈ నెల 6న మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాలో చెప్పుకోదగిన జిల్లా సిద్దిపేట. సిద్దిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి హరీశ్ రావు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ రాష్ట్రంలో సిద్దిపేటను ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని కోమటి చెరువు అందాలను చూసి ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. దీనిని రాష్ట్రానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు మంత్రి హరీష్ రావు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ అంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్. అక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న అందాలకు ఏ మాత్రం తీసిపోకుండా సిద్దిపేట పర్యాటకుల కోసం కోమటి చెరువు మణిహారంగా మరో ఆహ్లదకరాన్ని స్మమర్ స్పెషల్ గా నెక్లెస్ రోడ్డు ను కానుకగా ఇవ్వనున్నారు. సిద్దిపేట నెక్లేస్ రోడ్డు ఆసియా ఖండం లోనే మొట్టమొదటిది... ఈ స్థాయిలో ఎక్కడ ఇప్పటి వరకు నిర్మాణం కాలేదు. మహానగరాలకు దీటుగా పలు ప్రత్యేకతల తో పర్యాటకుల కోసం అద్భుతంగా నిర్మించారు.

సింథెటిక్ వాకింగ్ , సైక్లింగ్ ట్రాక్..

కోమటిచెరువు చుట్టూ సుమారు 4 కిలోమీటర్ల మేర ఈ నక్లెస్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. ఎరుపు రంగుల పిల్లర్ల కిందుగా నిర్మించిన ఈ రహదారి వంకర్లు తిరుగుతూ అచ్చం నక్లెస్‌ గొలుసును తలపించేలా కనిపిస్తున్నది. అంతేగాకుండా సింథిటిక్ సైకిల్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

komari cheruvi, siddipeta, harishrao, tourist place, neclase road, asia continent
చూపరులను ఆకర్షిస్తున్న కోమటి చెరువు అందాలు

కోమటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్

ఉదయాన్నే చెరువును చూస్తూ ఆహ్లాద వాతావరణంలో వ్యాయామం, నడక, జాగింగ్‌ చేసేలా వసతులు ప్రత్యక్షం కాబోతున్నాయి. ఓపెన్‌ జిమ్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు కూర్చుని సేద తీరేల ఆకర్షణీయమైన రాతి కుర్చీలు ఏర్పాటు చేశారు.. ఇప్పటికే కోమటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన నెమలి, గద్ద తదితర విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిరంతరం పర్యవేక్షణ ఉండేలా సీసీ కెమెరాల నిఘాతోపాటు లేక్‌ పోలిస్‌ ఔట్‌పోస్టును కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు.మంత్రి హరీశ్‌రావు సైతం తనకు కాసేపు సమయం దొరికినా కోమటిచెరువుపై వాలిపోతుంటారు. వాకింగ్‌తోపాటు బోటింగ్‌ షికారు చేస్తుంటారు. ఇప్పుడు నక్లెస్‌ రోడ్డు నిర్మాణంతో కోమటిచెరువు మరింత కలర్‌ఫుల్‌గా తయారైంది. ఈ అద్భుతమైన కనువిందు చేసే కలర్ ఫుల్ నెక్లేస్ రోడ్డు ఈ నెల 6వ తేదీన మంత్రి హరీష్ రావు చేతుల మీద సంబురంగా ప్రారంభం కానుంది.

First published:

Tags: Finance minister, Harishrao, Komati cheruvu, Necklace road, Siddipeta

ఉత్తమ కథలు