warangal : డబ్బుల హమీ పత్రంతో రిటైర్డ్ వీసీ శవాన్ని ఇచ్చిన ఆసుపత్రి..

డబ్బుల హమీ పత్రంతో రిటైర్డ్ వీసీ శవాన్ని ఇచ్చిన ఆసుపత్రి..

warangal : యూనివర్శిటి రిటైర్డ్ వైస్‌చాన్స్‌లర్‌కు సైతం ఆసుపత్రిలో కరోనా బిల్లు గోడవ తప్పలేదు. ప్రజా ప్రతినిధులు నచ్చజెప్పినా ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించలేదు..చివరకు మాజీ వీసి శిశ్యుడు ఓ హామీ పత్రం ఇస్తే గాని శవాన్ని అప్పగించని దైన్యం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెలకొంది.

  • Share this:
ఆసుపత్రికి చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తేనే..శవాన్ని అప్పగిస్తామని ఓ ఆసుపత్రి యజమాన్యం నిస్సిగ్గుగా తేల్చిచెప్పింది. చివరకు ఎవరు చెప్పినా వినకుండా హామి పత్రం రాసుకుని గాని శవాన్ని ఇవ్వలేదు. దీన్ని బట్టి కరోనా పేషంట్ల పరిస్థితి ఆసుపత్రుల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రులు కరోనా ట్రీట్‌మెంట్‌తో లక్షల రూపాయల బిల్లులు వేస్తూ..అవి కట్టని వారిని ఎలా మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారో చెప్పవచ్చు..

వివరాల్లోకి వెళితే కాకతీయ యూనివర్శిటి ప్రోఫెసర్, తెలంగాణ యూనివర్శిటి వైస్‌చాన్స్‌లర్ గా రిటైర్ అయిన పసుల సాంబయ్య, వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో కరోనా చికిత్స పొందతూ మృతి చెందాడు. అయితే ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరినా..చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చింది..ఇంతలోపే ఆయనకు గుండె నొప్పి రావడంతో బుధవారం మృతి చెందారు.

అయితే కరోనా సోకడంతో ఆయన గత పదిహేను రోజులుగా హన్మకొండలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆయన చికిత్సకు సంబంధించి మొత్తం పది లక్షల రూపాయలు కాగా ,అప్పటికే నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. కాగా మిగిలిన డబ్బులు లేకపోవడంతో సీఎంఆర్ఎఫ్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కాని అది ఆలస్యం అయింది. ఈ లోగా సాంబయ్య మృతి చెందారు.

ఇక్కడే ఆసుపత్రి యాజమాన్యం కక్కుర్తి చూపించింది. చెల్లించిన నాలుగు లక్షలు పోను మిగతా ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నగరానికి చెందిన ప్రముఖులు చెప్పినా వినకుండా..డబ్బులు ఇస్తేనే శవం అంటూ మొండికేశారు. దీంతో చేసేదేం లేక, సాంబయ్య శిశ్యుడైన డాక్టర్ బండి శ్రీను ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్ రాకపోతే తాను స్వతహాగా డబ్బులు చెల్లిస్తానని హామీ పత్రం ఇచ్చిన తర్వాత శవాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన పార్థీవ దేహాన్ని తన స్వగ్రామమైన పరకాలలోని నాగారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Published by:yveerash yveerash
First published: