FIRST OMICRON CASES IN KHAMMAM DIST TELANGANA REGISTERED 2 NEW CASES TALLY REACHES 44 MKS KMM
Omicron : ఖమ్మంలొ తొలి ఒమిక్రాన్ కేసు.. హైదరాబాద్ నుంచి వచ్చిన యువతికి పాజిటివ్..
ప్రతీకాత్మక చిత్రం
ఇన్నాళ్లూ విదేశాల నుంచి వచ్చినవారిలోనే వైరన్ ను గుర్తించగా, ఇప్పుడు ప్రైమరీ కాంటాక్టులు సైతం ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నారు. ఖమ్మం జిల్లాలొ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. తెలంగాణకు సంబంధించి ఇవాళ మూడు కొత్త కేసులు రాగా, ఖమ్మంలో ఓ యువతి తొలి కేసుగా నిర్ధారణ అయింది.
ప్రస్తుతానికి భయం, ఆందోళన చెందొద్దని భారత సర్కారు చెబుతున్నా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారి అయిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వల్ల ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది. ఇప్పటికే యూరప్ దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలకు కారణమైన ఒమిక్రాన్.. అమెరికాలోనూ అలజడి చేస్తున్నది. ఇటు ఇండియాలోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ విదేశాల నుంచి వచ్చినవారిలోనే వైరన్ ను గుర్తించగా, ఇప్పుడు ప్రైమరీ కాంటాక్టులు సైతం ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నారు. ఖమ్మం జిల్లాలొ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. తెలంగాణకు సంబంధించి ఇవాళ మూడు కొత్త కేసులు రాగా, ఖమ్మంలో ఓ యువతి తొలి కేసుగా నిర్ధారణ అయింది.
ఖమ్మం పట్టణానికి చెందిన 21 ఏళ్ల యువతి ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆమె ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోగా, కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో జిల్లా హెల్త్ అధికారులు ఆమె శాంపిళ్లను వైరాలజీ ల్యాబ్ కు పంపగా, యువతికి సోకింది ఒమిక్రాన్ వైరసే అని ఆదివారం నాడు నిర్ధారణ అయింది. ప్రైమరీ కాంటాక్ట్ కింద యువతి కుటుంబీకులకూ పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం.. వారి శాంపిళ్లను కూడా ల్యాబ్ కు పంపారు.
ఖమ్మం యువతితో కలిపి తెలంగాణలో ఇవాళ కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44 కి పెరిగింది. కొత్తగా నమోదైన మూడు కేసుల్లో రెండు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులు కాగా, ఒకటి ఒమిక్రాన్ పేషేంట్ కాంటాక్ట్ కు చెందినది. ఇప్పటి దాకా 10 మంది కోలుకోగా, ప్రస్తుతం తెలంగాణలో 34 ఒమిక్రాన్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగానూ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లకు కూడా కొత్త మహమ్మారి వ్యాపించింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 422 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 కేసులుండగా, 44 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త ఏడాది వేడుకలను ప్రభుత్వం నిషేధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు పబ్లిక్ పేసుల్లో కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం బ్యాన్ చేసింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.