Home /News /telangana /

FIRST IN INDIA TELANGANA GOVT TO LAUNCH INSURANCE COVERAGE TO WEAVERS NETHANNA BEEMA SCHEME FROM AUGUST 7 NATIONAL HANDLOOM DAY SAYS TRS MIN KTR MKS

Nethanna Beema : దేశంలోనే తొలిసారి.. రైతు బీమా తరహాలో చేనేత కుటుంబాలకు రూ.5లక్షలు : KTR

నేతన్న బీమా పథకంపై మంత్రి కేటీఆర్ ప్రకటన

నేతన్న బీమా పథకంపై మంత్రి కేటీఆర్ ప్రకటన

రైతు బీమా తరహాలో చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కారు ‘నేతన్న బీమా’ పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 నుంచే నేతన్నకు బీమా పథకం మొదలవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సంక్షేమ పథకాల విషయంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ (Telangana)లో మరో సరికొత్త పథకం ప్రారంభానికి సిద్ధమైంది. రైతు బీమా (Rythu Beema) తరహాలో చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కారు ‘నేతన్న బీమా’ (Nethanna Beema) పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. జాతీయ చేనేత దినోత్సవం (National Handloom Day) ఆగస్టు 7 నుంచే నేతన్నకు బీమా పథకం మొదలవుతుందని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. రైతులు పైసా కట్టకుండానే, ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించే ఈ పథకం విశేషాలు, మంత్రి చెప్పిన వివరాలివే..

చేనేత కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని, అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

Al Qaeda Al-Zawahiri : అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని లేపేశాం : US Prez Joe Biden


బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు మంత్రి కేటీఆర్. పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు.

Telangana | Ration : అగస్ట్ 4నుంచి రేషన్‌ కార్డుపై ఒక్కొక్కరికి 15కేజీల బియ్యం ఉచితం .. ఎన్ని నెలలు ఇస్తారంటే


నేతన్న బీమా పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని, ఈ పథకం అమలుకు.. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (LIC)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

Hyderabad : బ్యాంక్ ఖాతాలు అద్దెకిస్తూ రూ.కోట్లకు టోకరా.. ఆ యువతి తీరుకు పోలీసులే షాక్..


60 ఏళ్ల లోపు వయస్సున్న చేనేత, మరమగ్గాల కార్మికులు నేతన్న బీమా పథకానికి అర్హులని, సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్ లభిస్తుందని కేటీఆర్ వివరించారు. అర్హులైన చేనేత, పవర్‌లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికి నేతన్న బీమా పథకాన్ని అమలుచేస్తామని మంత్రి వెల్లడించారు.

PM Modi | Mann ki Baat : ఆగస్టు 2 నుంచి మీ సోషల్ మీడియా డీపీ ఇలా మార్చుకోండి : మోదీ


చేనేత, జౌళి రంగానికి 2016-2017 నుంచి ప్రతి సంవత్సరం రూ.1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్‌కు ఇది అదనమని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్‌ కింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ కింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ.400 కోట్లు కూడా కేటాయించామని వెల్లడించారు.



ఇదిలా ఉంటే, దేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సందర్భంగా ఇంటింటా జాతీయ పతకాన్ని ఎగరేసే కార్యక్రమానికి అవసరమైన కోట్లాది జెండాల ఆర్డర్లను తెలంగాణ ప్రభుత్వం స్థానిక చేనేత కార్మికులకు అప్పగించగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చైనా నుంచి జెండాలను దిగుమతి చేస్తుండటం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. స్వాతంత్య్ర సంబరాల కోసం కనీసం జాతీయ జెండాలను దేశంలో తయారు చేయించాలనే ప్రణాళిక లేని పరిస్థితుల్లో కేంద్రం ఉందని, మోదీ చెప్పే ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటే ఇదేనా? అని కేటీఆర్ ఆగ్రహించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Handloom, Insurence, KTR, Minister ktr, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు