First Gay Marriage in Telangana : రికార్డ్... రాష్ట్రంలో ఇద్దరు మగాళ్ల మధ్య తొలి పెళ్లి...!
First Gay Marriage
First Gay Marriage in Telangana : తెలంగాణా రాష్ట్రంలో తొలి గే వివాహం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చిన సుప్రియో, అభయ్‌లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
విదేశీ సంస్కృతి తాజాగా తెలంగాణకు పాకింది.. స్వలింగ సంపర్కుల పెళ్లిలకు చట్టబద్దత కల్పించడంతో దేశవ్యాప్తంగా ఈ పెళ్లిల్లు వెలుగు చూస్తున్నాయి. ఒక సాధారణ మ్యారేజి వలే కాకుండా గే ల పెళ్లిల్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.( First Gay Marriage in Telangana ) అయితే ఇందులో పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేకున్నా... ఈ సంస్కృతి కొత్త రాష్ట్రం తెలంగాణకు కూడా పాకింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా స్వలింగ సంపర్కుల పెళ్లి జరిగింది. ( First Gay Marriage in Telangana )అది కూడా ప్రోఫెషనల్ గా సెటిల్ అయిన ఇద్దరు మగాళ్ల మధ్య పెళ్లి జరగడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సుప్రియో , సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్న అభయ్‌లు గత ఎనిమిదేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయయ్యారు. ( First Gay Marriage in Telangana ) అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.ఆ తర్వాత వీరి అభిప్రాయాలు కలవడంతో తమ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు.
కాగా ఈ వివాహ వేడుక వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో అంగరంగవైభవంగా జరగగా.. వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. దీంతో తెలంగాణాలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా రికార్డ్ సృష్టించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.