• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • FIRST DAY OF LOCKDOWN GOING ON SUCCESFULLY OVER TELANGANA VRY

Lock down : సమయం లేదు మిత్రమా..! ఉరుకులు పరుగులతో నగర వాసులు !

Lock down : సమయం లేదు మిత్రమా..! ఉరుకులు పరుగులతో నగర వాసులు !

మొదటి రోజు లాక్‌డౌన్..ఉరుకులు పరుగులతో నగర వాసులు !

Lock down : మొదటిరోజు లాక్‌డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఉరుకులు పరుగులతో నగర వాసులు గత పనులను చక్కదిద్దుకున్నారు. సమయం మించిపోతుండడంతో రోడ్లపై ఉరుకులు పరుగులు పెట్టారు.

  • Share this:
తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రెండవ సారి విధించిన లాక్డౌన్‌లో నాలుగు గంటల పాటు సడలింపు ఇవ్వడంతో ఆ సమయంలో తమ పనులు చక్కబెట్టేందుకు జనం రోడ్లపై బారులు తీరారు. గత కోద్ది రోజులుగా ఉదయం వేళల్లో ఇంత రద్ది కనబడక పోయినా...లాక్డౌ‌న్‌తో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. తమకు కావల్సిన వస్తువులు ,తీసుకువెళ్లడంతో పాటు పర్మిషన్ ఇతర పనుల కోసం వచ్చిన వారితో రోడ్లన్ని కిక్కిరిసి పోయాయి.

అయితే లాక్‌డౌన్ పదిగంటలకే ముగియుండడంతో బయటికి వచ్చిన వారంతా తిరిగి ఇళ్లలోకి చేరేందుకు పదిగంటల సమయంలో ఉరుకులు పరుగులు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లో పలు దుకాణాలు వ్యాపార సముదాయాలు ఉదయం నుండే తెరుచుకులేదు. కేవలం అత్యవసర వస్తువులు, కూరగాయలు ,పళ్లు మాత్రమే రోడ్లపై ఎక్కువగా దర్శనమిచ్చాయి. మరోవైపు ఆర్టీసీ సైతం ఉదయం పదిగంటల వరకు కొన్ని బస్సులను నడిపింది.

ఇక లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసే కీలక భాద్యత పోలీసులపై ఉండడంతో వారంతా ఉదయం పది గంటల వరకే భారీ కేడ్లను ఏర్పాటు చేసి విధులు నిర్వహించారు. నగరంలోని పలు సర్కిళ్లతో పాటు ప్రధాన కూడళ్లలో ఆయా పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు లాక్‌డౌన్ అమలును పర్యవేక్షించారు. పది తర్వాత బయటకు వచ్చిన వారిని మొదటి రోజు కావడంతో అక్కడక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి వేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో లిమిట్స్ దాటి వెళ్లకుండా కట్టడి చేశారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపించడంతో పాటు , వాహనదారులకు జరిమానాలు కూడ విధించారు. కాగా లాక్‌డౌన్‌లో ఆసుపత్రులకు వెళ్లేవారిని అడ్డకోకుడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు సైతం అమలు చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: