హోమ్ /వార్తలు /తెలంగాణ /

Firing in Hyderabad: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన వైనం.. వివరాలివే..

Firing in Hyderabad: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన వైనం.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చాలా రోజులుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరం కాల్పులతో ఉలిక్కిపడింది. నగరంలోని నాగోల్‌లో దుండగులు తెగబడ్డారు. ఓ బంగారం షాపులో చొరబడ్డ దుండగులు కాల్పులు జరిపి బెదిరించి బంగారాన్ని దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగోల్ స్నేహపురి కాలనీలోని ఓ బంగారం షాపులోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. బంగారం షాపులో ఉన్నవారిని బెదిరించేందుకు దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆధారాల కోసం సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడమే లక్ష్యంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే.. కస్టమర్ల రూపంలో వచ్చిన దొంగలు నిర్వాహకులను నమ్మించి కాల్పులు జరిపినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు కాల్పులు జరిగిన బంగారం షాపు వద్దకు భారీగా తరలి వస్తుండడం పోలీసుల దర్యాప్తుకు ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు అక్కడి వచ్చిన వారిని వెనక్కు పంపించి వేస్తున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే దుండగులు పథకం ప్రకారం ప్రకారమే కాలనీలోని గోల్డ్ షాపును దొంగతనానికి ఎంచుకున్నట్లు సమాచారం.

ప్రశాంతంగా ఉండే స్నేహపురి కాలనీలో కాల్పులు జరిగాయన్న వార్త తెలుసుకున్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులను త్వరగా పట్టుకుని శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Hyderabad

ఉత్తమ కథలు